-
-
కీర్తన IPS
keertana IPS
Publisher: Self Published on Kinige
Pages: 35Language: Telugu
"ఎల్లుండి నువ్వు నా దగ్గరకు వచ్చావంటే రెండు లక్షల రూపాయలు నీకిప్పిస్తాను. వాటిని నీ అనాథ శరణాలయానికివ్వు" అంది.
"సారీ! కీర్తనా! ఎవరి దగ్గరో లంచం పిండి నువ్విచ్చే లక్షలు నాకక్కరలేదు" అన్నాడు దృఢంగా రవిప్రకాశ్.
"నన్ను గురించి ఏమనుకుంటున్నావ్! రవీ! నేను లంచాలు తినేదానిలా కనిపిస్తున్నానా? ఇప్పుడు నీకివ్వాలనుకున్న డబ్బు ఎలా వస్తుందో తెలిస్తే నువ్విలా మాట్లాడవ్. వారం క్రితం కిరణ అనే కుర్రాడు కిడ్నాప్‌కు గురైతే నేను రక్షించాను గుర్తుందా! ఆ అబ్బాయి వాళ్ళ తాత గొప్ప బిజినెస్ మేగ్నెట్. ఆ విషయం కూడా పేపర్లో వచ్చింది. ఆయన తన మనవణ్ణి రక్షించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా రెండు లక్షల రూపాయల చెక్కును నాకందించబోయాడు. కానీ నేను అవసరమైనప్పుడు తీసుకొంటానని చెప్పాను. ఎందుకో తెలుసా? ఇలాంటి సహాయ కార్యక్రమాలకి వినియోగించవచ్చని. ఈ రోజు మీ శరణాలయానికి నువ్వు చేస్తున్న సేవని చూసి ఆ రెండు లక్షలు నీ చేతుల మీదుగా మీ శరణాలయానికి అందజేయాలని అనుకొన్నాను తప్పా?"
