• kafan
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కఫన్

    kafan

    Author:

    Pages: 103
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాలమూరు రాజకీయ నాయకులు ఆంధ్ర పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ, వాళ్ళ సంపదకు దాసోహం అంటున్న సందర్భమిది. లేకపోతే కృష్ణానదిలో తమ జిల్లా న్యాయమైన వాటా కొరకు పోరాటం చేయకపోవడమేమిటి? ఆంధ్రా పెట్టుబడుదారులు, దేశ దళారీ నాయకులతో మిలాఖతై ప్రపంచీకరణ ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు, వ్యవసాయ జీవితానికి, గ్రామీణ వృత్తులకు పూర్తిగా వ్యతిరేకమైన ఒక నమూనాను ఈ దేశం మీద రుద్దారు. దాంతో కృష్ణానదిలో నీళ్ళ వాటా కోల్పోయి కరువుకు విలవిలలాడుతున్న పాలమూరు పేదల మీద ఈ దుర్మార్గ అభివృద్ధి నమూనాను రుద్దంతో గత రెండు దశాబ్దాలుగా ప్రజల జీవితం మరింత విధ్వంసానికి గురైంది. ఆ విధ్వంస చిత్రీకరణే ఈ కథలు. అయితే కథలు అనుభవాలనే చెప్పగలవు కాని కార్యకారణ సంబంధాలను పట్టుకొనేది కొంచెం కష్టం. ఇక్బాల్‌ కథలు ఆయన హృదయ స్పందన నుండి, లోతైన అవగాహన నుండి, నిశిత పరిశీలన నుండి రావడం వలన మారుతున్న సమాజం మీద, విధ్వంసమవుతున్న జీవితాల మీద మరింత లోతైన చర్చకు దారి తీస్తుందని, పాఠకులను మానవీకరించడానికి దోహదపడుతుందని ఆశిద్దాం.

- ప్రొ. జి. హరగోపాల్‌

ఇక్బాల్‌ జీవనదైన్యాన్ని చూస్తు ప్రతినిత్యం తను అనుభవించిన వేదనను కథలుగా మలిచాడు. ప్రజా జీవితం, కుటుంబాలు ఎట్లా సంక్షోభంలో కూరుకుపోయాయో కళ్ళకు కడుతూ ఆలోచింపచేసే చర్చను అందించాడు. ఈ వ్యవస్థ పట్ల అసహనాన్ని దీన్ని మార్చవలసిన అవసరాన్ని మనముందుకు తెచ్చాడు. ఇవన్నీ అతను ప్రేమించిన పల్లెల, పాత్రల, పరిసరాల, పరిణామాల విశ్లేషణలు.

- పాలమూరు అధ్యయన వేదిక

Preview download free pdf of this Telugu book is available at kafan