• jeevana vikaasamu
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 75.6
  84
  10% discount

  Home delivery

  • fb
  • Share on Google+
  • Pin it!
 • జీవన వికాసము

  jeevana vikaasamu

  Pages: 647
  Language: Telugu
  Rating
  2 Star Rating: Recommended
  2 Star Rating: Recommended
  2 Star Rating: Recommended
  2 Star Rating: Recommended
  2 Star Rating: Recommended
  '2/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

"జీవన వికాసము" పుస్తకం రెండు భాగాలు కలసిన సంకలనం ఇది.

మనం బహు ప్రాముఖ్యం గల కాలంలో నివసిస్తున్నాం. బహుశా ఈ కాలం అత్యుత్తమమైనదే కాక అత్యధమమైనది కూడ కావచ్చు. ఒక వైపు వైజ్ఞానికశాస్త్రంలోని అపూర్వమైన ప్రగతి మనం ఒక శతాబ్దం ముందు ఊహించని సుఖాలను, సదుపాయాలను అందిస్తుంది. ఒక్క క్షణంలో మనం ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా మాట్లాడగలం, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయో చూడగలం, చంద్రునిపైకి వెళ్ళగలం, ఇంటర్‌నెట్‌ ద్వారా అంతులేని సమాచారాన్ని పొందగలం, ప్రాణాంతకమైన అనేక వ్యాధుల బారి నుండి రక్షించుకోగలం, మరియు దీర్ఘాయుస్సునూ పొందగలం.. ఇది నాణేనికి ఒక పార్శ్వం, తేజోవంతమైన భాగం.

అయితే ఈ నాణేనికి మరో పార్శ్వం కూడ వుంది. అది చాలా వికృతమైనది. ప్రపంచమంతా అహింస ప్రజ్వరిల్లుతోంది. నేరం రాజ్యమేలుతోంది.

ప్రతిచోటా అవినీతి జీవన మంత్రమైనది. మన తలలపై అణుబాంబులు వేలాడుతున్నాయి. ఒక మూర్ఖుడు అనాలోచితంగా దీన్ని ప్రయోగించం జరిగితే ఈ భూమిపై మానవాళి సమూలంగా తుడిచిపెట్టుకుపోవచ్చు. మనశ్శాంతి అనేది అపహాస్యంగా మారింది.

ఈ సుడిగుండంలో చిక్కుకొని బాగా ప్రభావితమయ్యేది ఎదుగుతూన్న యువతరం. యువత అపారమైన ధైర్యాన్ని కలిగి, ఆశావహధృక్పథం గలవారైనప్పటికీ అత్యున్నత ఆలోచనలకు, ఆదర్శాలకు అతి సున్నితం. వారు మత ప్రసంగాలకు దూరం. వారికి బోధించినట్లు కాకుండ బోధించాలి. తెలియని విషయాలను వారు మరిచిపోయిన విషయాలుగా చెప్పాలి.

స్వామీ జగదాత్మనందజీ యొక్క ఈ పుస్తకము సరిగ్గా ఇటువంటిదే. ఈయన మన దేశంలోను మరియు విదేశాలలోను యువతతో ఎక్కువగా కలిసిమెలిసి వారిని విజయవంతంగా మార్గ నిర్దేశం చేశారు. యువతలోని అత్యద్భుత శక్తిని, కళాత్మకతను స్పృశిస్తూ యువత మహాత్ముల అడుగుజాడలలో నడిచే అవకాశాన్ని ఈ పుస్తకం కల్పిస్తుంది. చారిత్రక వర్ణనల ద్వారా పుస్తక రచయిత ఆత్మవిశ్వాసం, పట్టుదలవంటి గొప్ప గుణాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.

శ్రీరామకృష్ణ ప్రభలో ధారావాహికంగా ప్రచురింపబడుతున్న 'విజయవంతంగా జీవించడం ఎలా...? అనే శీర్షిక సంకలనమే ఇది.

ఈ పుస్తకం ద్వారా యువత తమ తోటివారికి నిస్వార్థ సేవ చేయడంలో సంతృప్తిని పొంది, ఉన్నత లక్ష్యం కోసం పాటుపుతుందని ఆశిస్తూ....

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at jeevana vikaasamu