• jaagriti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    Print Book Help
    Out of stock

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • జాగృతి

    jaagriti

    Pages: 130
    Language: Telugu, English
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వామి వివేకానంద స్ఫూర్తి వచనాలు, సామాన్యమైన సూక్తులు కావు. వాటిలోని ప్రతి అక్షరానికి అక్షయమైన శక్తి ఉంది. అవి వ్యక్తుల దౌర్బల్యాన్ని, ఆత్మన్యూనతాభావాన్ని పటాపంచలు చేస్తాయి. చదివిన ప్రతిసారి మనలో నూతన ఉత్తేజాన్ని నింపే ఆ వచనాస్త్రాలను అనువదించడం కొండను అద్దంలో బంధించడమే అవుతుంది. కానీ పూర్వజన్మ సుకృతం కొద్దీ, ఆ సౌభాగ్యం లభించినవారు నిజంగా ధన్యులు.

స్వామి వివేకానంద అనుగ్రహంతో సాగిన ఈ తెలుగు అనువాదం భావప్రధానంగా సాగింది. ప్రకృతిలోని దృష్టాంతాలను ఉపయోగించి, అంతర్మథనాన్ని రేకెత్తించాలన్నదే ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం. అందుకే స్వామి వివేకానంద భావాలను యువత హృదయానికి హత్తుకునే విధంగా, మారిన కాలానికి తగ్గట్లుగా సచిత్రంగా అందిస్తున్నాం. స్వామీజీ స్ఫూర్తి వచనాలకు అనుగుణంగా ఉండేట్లు చిత్రాలలో కొన్నింటిని నిగూఢంగా, మరికొన్నింటిని ఆహ్లాదకరంగా, ఇంకొన్నింటిని ఆలోచనాత్మకంగా ఉండేలా ఎన్నుకున్నాం. భావాన్ని కొన్ని చిత్రాలు ఉన్నది ఉన్నట్లుగా చిత్రిస్తే, మరికొన్ని భావంలోని ఉత్తేజకరమైన కోణాన్ని మన ముందుంచుతాయి. భావంలోని ప్రతికూల దృక్పథాన్ని నివారించాలనే ఆశయంతో మనం ఎలా ఉండకూడదో కొన్ని చిత్రాలు వివరిస్తాయి. స్వామి వివేకానంద మాటల్ని యథాతథంగా ఆంగ్లంలో అందిస్తూ, వాటి అంతరార్థాన్ని పాఠకులకు, ముఖ్యంగా యువతకు విశదీకరించాలనే తాపత్రయం నుండి ఈ పుస్తకం రూపొందింది.

మాతృభాషలోని మాధుర్యాన్ని రంగరించి, ఆ శక్తిగుళికలను స్వీకరించి జీర్ణం చేసుకోవాలనుకునే వారి కోసమే ఈ ప్రయోగం. కాబట్టి కేవలం చదవడానికే కాక, స్వామి వివేకానంద భావాలను అధ్యయనం చేయడనికి, వాటిని ఆకళింపు చేసుకొని, కొంతైనా ఆచరించడానికి పుస్తకంలోని ప్రతి పుట, ఉపయుక్తం కాగలదని ఆశిస్తూ....

- అధ్యక్షులు,
రామకృష్ణ మఠం, హైదరాబాదు.

గమనిక: "జాగృతి" ఈ-బుక్ సైజు 22.8 MB

Preview download free pdf of this Telugu, English book is available at jaagriti