• gidee_telangana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గిదీ తెలంగాణా

    gidee_telangana

    Author:

    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

Even though it may only take one hour to produce a great work of art, there are years of nurtured vision and feeling in every stroke. - Susan Easton Burns.

ఎన్నో ఏళ్లుగా తనలో తాను మధనపడి జరిపిన ఆలోచనలకు, పొందిన ఆవేశానికి చిత్రానువాదాలే రెండు నెలల్లో శేఖర్ గీసిన ఈ బొమ్మలు - కార్టూన్లు. సరైన సమయంలో సరైన ప్రతిస్పందన ఇది.

నీళ్లు, సహజ వనరులు, భూమి, భుక్తి అన్నీ వలస 'ఒంటెల' కిచ్చి డొక్కెండిన తెలంగాణ, గొంతెండిన తెలంగాణ శేఖర్ రేఖల్లో కన్నెర్ర జేశాయి. తెలంగాణ సంస్కృతి మూలాన్ని ఒక వైపు తన బొమ్మల్లో చెబుతూనే, వలసవాదుల దాష్ఠీకాన్ని తన పదునైన కుంచెతో 'తునకల దండెం'గా ఎండగట్టాడు శేఖర్. వలసవాద దోపిడీపై తెలంగాణ బిడ్డగా శేఖర్ ధర్మాగ్రహమిది. ఈ ధర్మాగ్రహానికి ఎంతో చరిత్ర వుంది.

చిత్త ప్రసాద్ బొమ్మల నుంచి లక్ష్మా గౌడ్, వైకుంఠం, కాపు రాజయ్య, లక్ష్మణ్ ఏలేల పరంపరలో తెలంగాణ సంస్కృతీ, జీవన విధానం కష్టాలు కన్నీళ్లు కాగితాలపై, కాన్వాస్‌పై ఎగజిమ్మి, ఇపుడు కార్టూనిస్టుల వ్యంగాస్త్రాలుగా దూసుకొస్తున్నాయి. తెలంగాణ కుంచె చూపుకు దార్శనికతను అందించిన ఈ చరిత్రకు అంతులేని కొనసాగింపే శేఖర్ బొమ్మలు - కార్టూన్లు.

తెలంగాణ జీవితాన్ని చదువుకున్న శేఖర్ ఎన్నో సామాజిక ఉద్యమాల్లో అస్తిత్వ పోరాటాల్లో ఒక చిత్రకారునిగా ఎప్పుడూ ముందు వరుసలోనే వున్నాడు. శేఖర్ కుంచెకు రెండువైపులా పదునుంది. ఇటు కార్టూన్ల లో బరువైన సెటైర్‌ను, అటు ఇలస్ట్రేషన్‌లలో లోతైన తెలంగాణ జీవన మూలాన్ని ప్రతిభావంతంగా పలికించగలిగాడు శేఖర్.

తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతూ, ఎవరికి వారు చావో, రేవో తేల్చుకోవాల్సిన ఈ పరీక్షా సమయంలో - శేఖర్ ఈ పుస్తకాన్ని మన ముందుంచాడు. ఈ సంధర్భంగా ఆఫ్రో, అమెరికన్ సామాజిక కార్యకర్త, కవి రచయిత ఒస్సి డేవిస్ మాటలు గుర్తొస్తున్నాయి...

Any form of art is a form of power, it has impact, it can affect change. It can not only move us. IT MAKES US MOVE...

-- అక్బర్

Preview download free pdf of this Telugu book is available at gidee_telangana