• gautami
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గౌతమి

    gautami

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్య సంస్కారానికి నిలువెత్తు దర్పణం ఈ ‘గౌతమి (అహల్య)’. వాల్మీకి రామాయణంలో అహల్య కథ ఒక ప్రత్యేకమైన, ముఖ్యమైన ఘట్టం. అహల్యను తమదైన రీతిలో, తమ ఆంతర్య భావనా ముద్రతో ` నవలా లలామను చేసి ` ఈ గ్రంథాన్ని రాశారు వసుమతిగారు.

నవలా వస్తువు సామాన్యమైనది. వసుమతిగారు వాల్మీకి కథనాన్నే విధేయతతో అనుసరించి తమ సాహిత్య సంప్రదాయ విజ్ఞతను అహల్యని ప్రత్యేక శ్రద్ధతో, అపూర్వ సౌందర్యరాశిగా సృష్టించాడు బ్రహ్మ. గౌతమ పత్ని అయిందామె. ఆయన ఆధ్యాత్మిక చింతనలో, సాహచర్యంలో భాగమై మనోహర ప్రేమరాశిగా గార్హస్థ్య జీవితానికి నూతన నిర్వచనాన్నిచ్చింది. ఆ దంపతుల ప్రేమరాశిగా జన్మించాడు శతానందుడు. గౌతముడు తపోనిష్ఠకి పూనుకున్నాడు. అహల్య భర్తవియోగంతో వేగిపోతుంది. ఆది నుంచీ ఆమె పట్ల వ్యామోహితుడైన ఇంద్రుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆమెని చేరాడు. ఆమె వాల్మీకి మాటల్లో ‘దుర్మేధా దేవరాజకూతూహలాత్‌’ ‘మతించకార’! అంగీకరించింది! గౌతముడు చూశాడు ఇద్దరినీ శపించాడు. ఇద్దరికీ శాపోపశమనం అనుగ్రహించాడు. శ్రీరామ పాదస్పర్శతో అహల్య తేజోనిధిగా పునర్వికాసం పొందింది. గౌతముని చేరింది.

ఈ కథానిర్వహణని సంస్కారవంతంగా నిర్వహించి, దానికి ఉత్తమ నవలా రూపాన్ని ఇచ్చారు వసుమతిగారు. నవలా నిర్మాణంలో సంఘటనా క్రమాన్నీ, సన్నివేశ కల్పననీ అనల్పంగా రూపొందించి సంవిధానాన్ని ఉత్కంఠభరితం చేశారు. అహల్యా జననంతో మొదలై శాప విమోచనానంతర పునస్సమాగమంతో పూర్తవుతుందీ నవల.

నవలా వస్తువు శృంగార రసభూమిక కలిగినది. రచయిత వైయక్తిక సంస్కారాన్ని బట్టి ఎంత అశ్లీలంగానైనా మసాలా దట్టించి రాయడానికి అనువు చేసుకోగలిగిన ఇతివృత్తం. అలాంటి ఇతివృత్తాన్ని తీసుకుని ఎక్కడా లక్ష్మణరేఖని దాటకుండా ఆరోగ్యకరమూ, ఆనంద మయమూ అయిన కథనంతో తమ నవలకు ఔచిత్యాన్నీ ఔన్నత్యాన్నీ సాధించుకున్నారు
వసుమతిగారు. ఇదీ నిజంగా గౌతమీ నవల ఘనత!

‘గౌతమి (అహల్య)’ నవలాపఠనం - ఒక జీవితానుభూతిగా మిగులుతుంది. అందుకోండి ఆ ఆనందనుభవం.

- విహారి

Preview download free pdf of this Telugu book is available at gautami