-
-
దృష్టి (రెక్కలు)
dhrushti rekkalu
Author: Padma Kala
Language: Telugu
పద్మకళకి అనుభవానికీ, అనుభూతికీ ఉన్న భేదం తెలుసు. పైగా 'రెక్కలు' ప్రక్రియలోని అనుభవ రహస్యాన్ని గ్రహించారు. కొన్ని అసాధారణమైన సత్యాల్ని ఈ 'దృష్టి' సంపుటిలో పొందుపరిచారు. -డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు
జీవితాధ్యయనానికి స్త్రీ పురుషుల తేడా లేదు. 'కోట్లతో కొనలేనిది/వ్యక్తిత్వం' అంటోంది మా పద్మకళ. ఆత్మవిశ్వాసానికి ప్రతీక. పద్మకళ వెలువరిస్తున్న 'దృష్టి' రెక్కల సంపుటం కవయిత్రి దృష్టికి దర్పణమే. -ఎం.కె.సుగమ్బాబు
పద్మకళ రెక్కల కష్టం 'దృష్టి' రెక్కల సంపుటి. తాత్త్వికతని, భావుకతని, స్పష్టతని ఈ రెక్కలు తనలో నింపుకొని గండె తలుపులు తడుతున్నాయి. -డాక్టర్. జి.వి.పూర్ణచంద్
సమస్యల పట్ల మనం చూసే దృష్టి కోణం మార్చుకుంటేనే జీవితం మారుతుందని ప్రపంచంలోని వ్యక్తిత్వ వికాస నిపుణులు పదే పదే చెప్పే విషయాల్ని ఒక రెక్కలో ఇమిడ్చి చెప్పగలగడం పద్మకళ భావవ్యాప్తికి వ్యక్తీకరణకు వాహికగా రెక్కల ప్రక్రియను ప్రతిభావంతంగా, పదునుగా వినియోగించుకుంటున్నదనానికి తార్కాణం. -పి. శ్రీనివాస్ గౌడ్
వెనుక పేజీపై కవయిత్రి కవిత
నమస్కరిస్తే
నష్టం లేదు.
ప్రణమిల్లితే
ప్రాణం పోదు -
బేడా ఖరీదు చెయ్యవు
భేషజాలు
అద్భుత ప్రపంచం
ఎక్కడో
లేదు
నీ చుట్టూనే -
దృష్టి మార్చుకో
సృష్టి మారదు
రచయిత్రి గురించి
నిన్నటి నుండి నేర్చుకుంటూ
రేపటి నా కలల సాకారానికై నేటిని మలచుకుంటూ
నిన్న, రేపుల వారధిగా నేటికి సారధ్యం వహిస్తాను.
విశ్వ ప్రేమే లక్ష్యంగా జాగృతి, చైతన్యం ఆయుధాలుగా
మంచిని పెంచి, కుళ్లును త్రుంచి, నవతరానికి
ఇవ్వాలని అనుక్షణం ఆరాటపడుతున్న
అనంత జీవన సాగరంలోని
ఒక చిన్న నీటిబొట్టుని, కళలని ప్రేమించే కళని,
ప్రతిక్షణం జ్వలిస్తూ వెలుగునిచ్చే సూర్యుణ్ని కావాలని
పరితపించే పద్మకళని,
ఏనాటికైనా ప్రసార మాధ్యమంలో
నా ఉనికిని చాటుకోగలనన్న ధీమా
నా పాలిట అమృతకలశం.
http://telugukala.blogspot.com
http://rekkalu.blogspot.com
