• check
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చెక్

    check

    Pages: 222
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అందరూ దొడ్లోకి వచ్చారు.

“సుబాహు! అలా కూర్చో” అని ఆయన తులసి దిమ్మమీద కూర్చున్నాడు సుబాహు కింద కూర్చున్నాడు.

“చూడు నాయనా! నువ్వంటే నాకు వాత్సల్యం. నిన్ను ఎప్పుడూ నీ కులం ఏమిటో అడగలేదు. అందరిలోనూ ఆ భగవత్ స్వరూపం వుంటుందని నమ్మేవాడ్ని. అలా అని నాకు కుల పట్టింపులు లేవని కాదు. ఉన్నాయి. అయితే ఒక మనిషిని కులంవల్ల నీచంగా చేసే ప్రవృత్తి లేదు.

“... నిన్ను ఇన్ని రోజులూ ఆ ఉద్దేశ్యంతోనే మా ఇంట్లో చనువిచ్చాను. కానీ ఈ రోజు నీ మీద నిందపడింది. అది మంచికి జరిగిందో, చెడుకు జరిగిందో నాకు తెలియదు జరిగింది. దాని పర్యవసానాలన్నీ మనం అనుభవించాలి. మనం నిమిత్త మాత్రులం. మనిషి సంఘజీవి. సంఘంలో మనం జీవిస్తున్నప్పుడు మన ఇష్టాయిష్టాలతో పనిలేకుండా మనం కొన్నిటిని ఆచరించాలి. ఈ రోజు వూర్లో వాళ్లంతా నిన్ను వూరొదిలి వెళ్ళమన్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా నువ్వు ఇక్కడ వుంటానికి వీల్లేదు. వెళ్ళిపో నాయనా నీకు నేను కొంత డబ్బు ఇస్తాను. దాంతో ఎక్కడైనా హాయిగా బతుకు” అన్నాడు శేషాచార్యులు.

అంతసేపు అలా ఆయన మాట్లాడటం చాలా అరుదు. ఇక ఆ నిర్ణయానికి తిరుగుండదని తెలుసు గాయత్రికి.

“అలాగేనండి” అని తల వంచుకున్నాడు సుబాహు. అతను ఏడుస్తున్నట్టు గుర్తించింది గాయత్రి.