• chaMdrahaaraM
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చంద్రహారం

    chaMdrahaaraM

    Pages: 200
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

రచయిత్రుల్లో పొత్తూరి విజయలక్ష్మిగారిని గురించి విశేషంగా చెప్పవలసింది ఏమంటే, హాయిగా చదివించే ప్రసన్నమైన శైలికి తోడుగా హాస్యాన్ని జోడించి కథలో మనం లీనమయ్యేటట్లు చేయడంలో దిట్ట కావడం. ఆ కారణంగా ఆమె మీద హాస్యరచయితగా ముద్రపడిందంటారు; అదేదో మచ్చపడినట్లు అనుకోనక్కరలేదు. ఆ ప్రజ్జ అందరికీ రాదు; ఆ పేరూ రాదు. వచ్చినందుకు సంతోషించాలి, పైగా. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళందరూ హాస్యమంటే ఇష్టపడతారు కనక, తప్పకుండా చదువుతారు. మానసిక వైద్యుల దగ్గర అపాయింట్‌మెంట్ కావల్సినవాళ్ళ సంగతి మనకెందుకు? అయినా, హాస్య ప్రాధాన్య లేని కథలే ముందుగా అందిస్తానంటున్నారామె.

ఇప్పుడు విజయలక్ష్మిగారు 'చంద్రహారం' చేయించుకున్నారు. ఒకటీ, రెండూ - కాదు ఇది ఇరవై పేటల హారం. 'మేలిమీ కావాలి, మెడా తిరిగాలి' అనుకోవడం సరే - 'బరువూ పెరగాలి' అని అనుకున్నట్టున్నారు.

- పోరంకి దక్షిణామూర్తి

* * *

హాస్యప్రధానంగా రచనలు చేయడంవల్ల నా కథలు వెలుగు చూశాయి. నా పేరు చెప్తే హాస్యం గుర్తువస్తుంది పాఠకులకు. కానీ హాస్యం కాకుండా మరి కొన్ని కథలు రాశాను. ముందుగా ఆ కథలకే ప్రాధ్యాన్యతను యిస్తూ పుస్తకం వేయించుకున్నాను. ఈ సంపుటిలో కొన్ని హాస్య కథలకు కూడా చోటిచ్చాను. పుస్తక రూపంలో వస్తున్న నా కథలను పాఠకులు ఆదరిస్తారని నా నమ్మకం.

- పొత్తూరి విజయలక్ష్మి

Preview download free pdf of this Telugu book is available at chaMdrahaaraM