• bhavaani
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 102.6
    114
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భవాని

    bhavaani

    Author:

    Pages: 354
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కారు నడుపుతోందేగాని, భవాని ఆలోచనలు గంగాధర్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఇంతవరకు ఏమగాడ్ని చూసి స్పందించని తనమనసు గంగాధర్‌ని చూడగానే ఎందుకింతగా పరవశం అవుతోంది? రెండు రోజుల పరిచయంలోనే స్వప్న అతడ్ని గాఢంగా ప్రేమిస్తోంది. ఆమె ప్రేమిస్తోందని తెలిసీ తన మనసు అతడ్ని కోరుకోవటం తనకే ఆశ్చర్యంగా వుంది. అందం, సాహసం మూర్తీభవించిన యువకుడు అతను. వాడు తనకు తోడుంటే భైరవీమాత అనుగ్రహంతో ఆ వజ్రాన్ని సాధించటం కష్టమేమీ కాదు.

గంగాధర్‌ని తలుచుకుంటే మనసులో తనకే తెలీని ఆనందం. అందుకే ఒక ఐస్ క్రీం పార్లర్ సమీపంలో కారాపింది. పార్లర్ లోకి వెళ్ళి కూచుని వెనీలా ఐస్ క్రీం ఆర్డర్ చేసింది. అయితే తన కారును కొండలరావు ఇంటి ప్రాంతం నుంచి ఒక బైక్ ఫాలో చేస్తున్న సంగతి భవానికి తెలీదు. ఆమె కారుకు సమీపంలోనే ఆ బైక్ ఆగింది. బైక్ నడుపుతున్నవాడు ఇంజన్ ఆఫ్ చేయకుండా అక్కడే వున్నాడు. వెనక కూర్చున్న వాడు మాత్రం అటు యిటు చూస్తూ కారు వద్దకు వచ్చాడు.

జేబులోంచి ఆపిల్ పండు సైజులో ఒక వస్తువును బయటకు తీసాడు. అది టైంబాంబ్. సరిగ్గా ఇరవై నిముషాల తర్వాత పేలిపోయేలా దాన్ని సెట్ చేసి కారు అడుగు భాగంలో అతికించాడు. బాంబ్‌కి వున్న అయస్కాంతం కారును బలంగా పట్టుకుని జారిపోకుండా అతుక్కుంది. పని పూర్తికాగానే వాడు వెనక్కు వచ్చేసాడు. ఏమీ తెలీనట్టు సిగరెట్ ముట్టించుకొని వెయిట్ చేయసాగారు.

Preview download free pdf of this Telugu book is available at bhavaani