• agnisakshi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అగ్నిసాక్షి

    agnisakshi

    Pages: 158
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాష్ట్రంలో జైళ్లన్నీ తిరిగి, ఒక మనిషి నేరచరితుడు కావడానికి సమాజంలోని వివిధ ఆర్థిక, సామాజిక రాజకీయ కారణాలని విశ్లేషిస్తూ 'జైలుగోడల మధ్య' రాస్తున్నప్పుడు పెద్దాళ్లకంటే సమస్యలున్నాయి, చిన్న వాళ్లకు సమస్యలేమిటి? బాల నేరస్థులెందుకు తయారవుతున్నారో విశ్లేషించాలనే ఉద్దేశంతో 'పాపం... పసివాళ్లు!' కేస్‌ స్టడీస్‌ చేశాను.

పిల్లలు, పెద్దల నేరమయ జీవితాల్ని పరిశీలిస్తున్నప్పుడే ఏ పాపమూ ఎరుగని అబలలు అగ్నికి ఆహుతి అవుతున్నట్టు వస్తున్న వివిధ వార్తలు నన్ను కలిచివేసాయి. ఎందుకిలా జరుగుతోంది? అగ్నిసాక్షిగా వివాహమాడినవాళ్లే తమ భార్యల్ని అగ్నికి ఎందుకు ఆహుతి చేస్తున్నారు?

మనిషిని మనిషి మట్టుపెట్టే ఈ సంస్కృతి సమసిపోవాలంటే అందరికీ ఇతరుల గురించి అవగాహన ఉండాలి. ముఖ్యంగా 'పెళ్లి' అనే పవిత్రబంధం మీద! భార్యాభర్తల మధ్య . ఎక్కడో పుట్టి పెరిగి తమింటికి వచ్చిన పిల్లమీద ఇన్‌లాస్‌కి సరైన అవగాహన ఉండాలి. అప్పుడు వీళ్లమధ్య 'గాప్‌' కొంతయినా తగ్గి ఇలాంటి సంఘటనలు తగ్గుతాయనే ఉద్దేశంతో ఈ యధార్థగాధల్ని పేర్లు మార్చి అందించడం జరిగింది. ఇవి ఎవర్నీ కించపరచడానికి కాదని మనవి. దయచేసి వీటిని చదివి ఎవరైనా తమ ధోరణిని సక్రమమైన రీతిలోకి మరల్చుకుంటే ఈ శీర్షికకి సార్థకత, నా కృషికి ఫలితం లభించిందని ఆశిస్తున్నాను.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at agnisakshi