• achalapati kathalu print book
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అచలపతి కథలు

    achalapati kathalu print book

    Author:

    Publisher: Hasam Prachuranalu

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అచలపతి కథలు ఈ బుక్ మొదటి భాగం ఇక్కడ

అచలపతి కథలు ఈ బుక్ రెండవ భాగం ఇక్కడ

* * *

"హాస్యరసరాజ్యాధినేత వుడ్‌హౌస్ కథల్లో విహరించే జీనియస్ అయిన జీవ్స్ పాత్రే - ఈ ఇంపైన తెలిగింపు కథల్లో అచలపతి.
- మైనర్ బాబు వురఫ్ పిల్ల జమీందారు బెర్టీ వూస్టర్ అతి గడుసుగా తెచ్చిపెచ్చుకునే కష్టనష్టాలలో అతడిని కాపాడి గట్టెక్కించే సూత్రధారి
-దండలో దారంలాంటి అదృశ్య పాత్రధారి.

ఈ వుడ్‌హౌస్ కథలను ఎమ్బీయస్ ప్రసాద్ గారు తెలుగులో చెప్పారు. ఇది అనువాదం కాదు - అనుసృజనా కాదు.. తెన్గింపు కాదు - తెలుగింపు. ఇంపైన సొంపైన తేట తెలుగులో హాయిగా చెప్పారు..

ఇక వుడ్‌హౌస్ కథల గురించి చెప్పబోవడం దినమణి ముందు దివిటీ పట్టడమే..
ప్రసాద్‌గారు ఈ కథల్లో రేగే ఇంగ్లీషు ధూళిమీద తెలుగు పన్నీటి జల్లుతో పరిమళాలు వెదజల్లారు.

నాకు తెలిసిన ఒక 18 ఏళ్ళ విద్యార్థి - "హాసం" పత్రికలో ప్రసాద్ వ్రాసిన కథలు చదివి, రుచి మరిగి మరిగి - తన పుట్టిన రోజు కానుకగా బట్టలూ బంగారాలూ కొనవద్దని తల్లితండ్రులకి చెప్పి - హైదరాబాద్ వాల్డెన్ షాపులో నాలుగువేల రెండు వందల రూపాయలతో వుడ్‌హౌస్ సాహిత్యం సెట్టు కొనిపించాడు. ఇంతకన్నానంద మేమిరా!"

-ముళ్లపూడి వెంకటరమణ
చెన్నయ్
ఏప్రిల్, 2005