• Yuvataku Swami Vivekananda
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • యువతకు స్వామి వివేకానంద

    Yuvataku Swami Vivekananda

    Pages: 428
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనిషిని పుస్తకాలు ప్రభావితం చేసినంతగా మరే ఇతర సాధనాలూ చేయలేవు. వాటిని కవి 'పుస్తకాలు చేసే నిశ్శబ్ద విప్లవం'గా అభివర్ణిస్తాడు. భూత, భవిష్యత్ వర్తమానాలు ఎరిగి, భారతదేశపు సమగ్ర స్వరూపాన్ని అవగతం చేసుకొని, దాని ఔన్నత్యానికి ప్రయోజనం చేకూరే రీతిలో సందేశాన్ని అందించిన దార్శనికుడు, భారతజాతి గర్వించే మహాయోగి స్వామి వివేకానంద. వారి సందేశం ఆనాటి నుంచి ఈనాటి వరకు అసంఖ్యాక జనులకు స్ఫూర్తిని నిరంతరం ఇస్తూనే ఉంది. అయితే స్వామి వివేకానంద జీవితం, వారి ప్రబోధాలపై అసంఖ్యాక పుస్తకాలు వెలువడ్డాయి, వెలువడతాయి కూడాను.

ఈనాటి యువతరం జీవిత పోరాటంలో పోటీ ప్రపంచమే వారి ధ్యేయమని భావిస్తూ, కంటికి కనిపించే ప్రతీ వస్తువు తమకు కావాలన్న తపనతో చెడు విషయాలకు సహితం బానిసలుగా మారిపోతున్నారు. శాస్త్రసాంకేతిక రంగాలలో ప్రగతి యువతలో ఆత్మవిశ్వాసం కోల్పోయేటట్లు చేసే ప్రమాదకర పరిస్థితికి దారితీసేలా పరిణమించింది.

స్వామి వివేకానంద సమగ్ర సప్రామాణిక జీవిత గాథను రెండు భాగాలలో ఇంతకు మునుపే తీసుకురావడమూ, బహుళ ప్రజాదరణను పొందిన విషయం అందరికీ విదితమే. అయితే క్షణం తీరికలేకుండా పరుగులెడుతున్న ఆధునిక యువతకు స్వామి వివేకానంద జీవితాన్ని పరిచయం చేయాలన్న సత్సంకల్పంతో రెండు సంపుటాల సమగ్ర సప్రామాణిక జీవిత గాథను సంక్షిప్తంగా ‘యువతకు స్వామి వివేకానంద' పేరిట సంకలనం చేశాము. ఈ పుస్తకం చివరి భాగంలో ‘ఇంతకు ఎవరీయన' మరియు 'యువత నుంచి ఆయన ఆశించేదేమిటి” అన్న శీర్షికలను ప్రత్యేకంగా పొందుపరిచాం.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Yuvataku Swami Vivekananda