• Yuvaraju - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • యువరాజు (free)

    Yuvaraju - free

    Pages: 122
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చిన్నపిల్లల మనసు తెల్లని కాగితం వంటిది. వాళ్ళు ఎవరిదగ్గర ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా వారి హృదయంలో సహజంగా చెడు ఏమీ ఉండదు. కానీ వాళ్లతో ఉన్న వ్యక్తులవల్ల చిన్నప్పుడు పెరిగిన పరిస్థితులవల్ల కొందరు మంచివారిగా గొప్ప పేరు సంపాదిస్తే కొందరు చెడువారిగా మిగిలిపోతారు. పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారో అనునిత్యం గమనించవలసిన బాధ్యత వారి తల్లిదండ్రులమీద ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఎవరితో ఎక్కువగా ఉంటున్నారో, వాళ్ళ స్వభావమేమిటో తల్లిదండ్రులు గమనించుకోవాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు చెప్పే విషయాల కంటే, వాళ్ళ చుట్టూ ఉన్నవ్యక్తుల నుండి ఎక్కువగా నేర్చుకుంటారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల చెడుదారిలో వెళ్లిన పిల్లలు, తమ ఈ దుస్థితికి కారణం తల్లిదండ్రులని తెలిస్తే వాళ్ళని ఖచ్చితంగా ఇష్టపడరు.

ఈ కథలో విదర్భ యువరాజుకు కూడా ఇటువంటి సమస్యే వచ్చింది. తనకేమీ తెలియని పరిస్థితులు, చిన్నప్పటినుండి అసలు పట్టించుకోని తండ్రి.. చుట్టూ ఉండే వ్యక్తులు కలిసి మంచి-చెడు తెలియకుండా చేశారు. కానీ తనకి నిజం తెలిసేటప్పటికీ పరిస్థితులు చేయిజారి పోయాయి. తాను ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ప్రజలూ, మహారాజుతో పాటు రాజ్యం కూడా పూర్తిగా నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. తనతో ఉన్నవారు ఆ రాజ్యం వదిలి వెళ్లిపోతుంటే, యువరాజు చూస్తూ ఊరుకున్నాడా? మహారాజు నిర్లక్ష్యమే అతనికి, రాజ్యానికి ఈ దుస్థితి వచ్చేలా చేసిందని తెలుసుకున్న యువరాజేమి చేశాడు? ఇంతకీ యువరాజులో వచ్చిన ఈ పెనుమార్పుకు కారణం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు, ఈ కథ చదివితే మీకు లభిస్తాయి.

- వెంకట ఉదయ భాస్కర్ కోపల్లె

Comment(s) ...

కధ చాలా బాగుంది. యువరాజు మహారాజుకి బుద్ధి చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. Good story sir!!!!