• Yuga Purushudu Sri Guru Gobind Singh
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యుగ పురుషుడు శ్రీ గురు గోబింద సింగ్‌

    Yuga Purushudu Sri Guru Gobind Singh

    Pages: 130
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచ చరిత్రలో గురు గోబింద సింగ్‌తో పోల్చదగిన సద్గురువు, మహా యోధుడు మరొకరు లేరని నిస్సంకోచంగా చెప్పవచ్చు.

భారతదేశం విదేశీ దండ యాత్రలకు గురి కాబడుతున్న తొలి దశను, బాబర్‌ సైనికుల కిరాతకాలను పరమ పూజ్యులు, తొలి గురువు నానక్‌ దేవ్‌ స్వయంగా వీక్షించి, ఎంతో కలత చెందారు. స్త్రీలు, పసి పిల్లలు, వృద్ధులనే కనికరం లేకుండా ముష్కర సేనలు దారుణ మారణ కాండను, అత్యాచారాలను యధేచ్ఛగా చేశారు.

శ్రీ గురు నానక్‌ దేవ్‌ని చెరసాలలో బంధించటం జరిగింది. ఆయన ఎప్పుడూ 'ఆనందోబ్రహ్మ' స్థితిలో, దైవంతో గట్టి అనుబంధం కలిగి ఉండేవారు. దైవ వాణిని వింటూ, గానం చేసేవారు. అవన్నీ దైవ సందేశాలే!

శ్రీ గురు నానక్‌ దేవ్‌ కుల మతాలకు అతీతమైన, అత్యున్నతమైన, అంతవరకూ ప్రపంచంలో ఏ గురువూ ఎప్పుడూ చెప్పని భగవాన్‌ ధర్మాన్ని ప్రబోధించారు. అదే శిఖ్ఖు ధర్మానికి గట్టి పునాది వేసింది.

శ్రీ గురు నానక్‌ దేవ్‌ ఆధ్యాత్మిక జ్యోతి ఆయనతో సహా పదిమంది శిఖ్ఖు సద్గురువులలో ప్రభవిల్లింది. పరమాత్మ భారతదేశంలో దశావతారాలుగా అవతరించినట్లే, శిఖ్ఖు గురువులు పదిమంది అవతరించారు. శిఖ్ఖు ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తం చేశారు.

''గురు గోబింద్‌ సింగ్‌ని నా హీరో''గా భావిస్తాను. ఆయన చిత్రం చూస్తేనే మనసు శక్తిమంత మౌతుంది. ప్రపంచానికి 'ఖాల్సాపంథ్‌' ద్వారా ప్రస్తుత శిఖ్ఖు సోదరుల రూపధారణను పరిచయం చేసిన మహాత్ముడు శ్రీ గురు గోబింద్‌ సింగ్‌.

శిఖ్ఖు గురువుల పవిత్ర చరిత్రను దేశ ప్రజలందరూ కక్షుణ్ణంగా తెలుసుకు తీరాలి. LKG నుండీ PG వరకు వివిధ స్థాయిల్లో శిఖ్ఖు గురువుల గురించిన వివరణాత్మక గాథలు పాఠ్య గ్రంథాలలో ఉండి తీరాలి. అవి అనాయాసంగా దేశభక్తిని, ధర్మ దీక్షను అందరిలో ఉజ్వలంగా ప్రజ్వలింపజేస్తాయి. సందేహం లేదు.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

Preview download free pdf of this Telugu book is available at Yuga Purushudu Sri Guru Gobind Singh