• Yuddhakanda
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యుద్ధకాండ

    Yuddhakanda

    Publisher: Palapitta Books

    Pages: 104
    Language: Telugu
    Rating
    1.50 Star Rating: Recommended
    1.50 Star Rating: Recommended
    1.50 Star Rating: Recommended
    1.50 Star Rating: Recommended
    1.50 Star Rating: Recommended
    '1.50/5' From 2 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description


ఆకలి దప్పుల భారతంలో
అవమానాల ఆశ్వాసంలో
మా ప్రతీ ఇల్లు
ఓ యుద్ధకాండ


మనిద్దరం యిష్టపడలేదు
ముందు నన్ను నువ్వు
తర్వాత నిన్ను నేను
అప్పుడే మొదలైంది యుద్ధం


నేను ఈ మట్టికి పూసిన వాణ్ణి
నువ్వు ఆకాసం నుండి ఊడిపడ్డవాడివి
నీది మధ్య ఆసియా మనస్తత్త్వం
నాది దేశవాళి దేహం


నీది శుక్లపక్షం
నాది కృష్ణపక్షం


వడగళ్ళు వర్షించినా
నేను పూలతోటనై పరిమళిస్తాను
నువ్వు అమృతం తాగినా
విషం కక్కుతావు


నువ్వు మనిషిని దేవుణ్ణి చేస్తావు
నేను దేవుణ్ణి మనిషిని చేస్తాను
కలిసి బతకడం నీకు ప్రమాదం
కలిసి బతకడం నాకు ప్రమోదం


బతుకు పోరు
యుద్ధ హోరు


మార్తున్న శతాబ్దాలు
మారని తీరు


సంధి కుదరదు
యుద్ధం సశేషం
యుద్ధం వర్తమానం

Preview download free pdf of this Telugu book is available at Yuddhakanda