• Yogavali Khandam Jataka Narayaneeyam 2
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 250
    250
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యోగావళి ఖండం (జాతక నారయాణీయం - 2)

    Yogavali Khandam Jataka Narayaneeyam 2

    Pages: 141
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

సంస్కృతాంధ్రములలో గల జ్యోతిష గ్రంథములలో యోగ విషయమున “పూర్వపారాశరి”కి మించినది మరొకటిలేదు. ఇది జాతకచంద్రికయని సామాన్యముగా వ్యవహరింపబడుచున్నది. వాస్తమునకు దీని యందలి ముప్పదియేడు శ్లోకములు మాత్రమే పరాశర ప్రణీతములు. శ్రీ వేంకటేశ్వర దైవజుడు మొదట మూడు శ్లోకములను చివర నలువది శ్లోకములను చేర్చి మొత్తం ఎనుబది శ్లోకములకు “జాతక చంద్రిక" యని పేరిడెను. ఈ జాతకచంద్రికను చదువని జ్యోతిష్కులుండరు. ఈ గ్రంథ ప్రాశస్త్యమునకు కారణమేమన గ్రంథకర్తయగు పరాశరమహర్షి తన యనుభవమును నొకచోట జేర్చి రత్నముల వంటి ముప్పదియేడు శ్లోకములను లోకమునకు ప్రసాదించుటయే. ఈ ముప్పది యేడు శ్లోకములు నతిక్లుప్తముగ నుండి భావ విషయమున మాత్రము నలిగంభీరములై యోగవిషయమున శాస్త్రసార గర్భితములుగానున్నవి.
ఈ గ్రంథము యొక్క యుత్కృష్టతను గుర్తించియే కాబోలు “సర్వక్రతువు, వేంకటేశ్వర దైవజ్ఞుడు, ఆలూరి యేకామదైవజ్ఞుడు” మొదలగువారిరువది మందికి పైగా దీనికి వ్యాఖ్యానములను వ్రాసియుండిరి. ఇందలి విషయములు (యోగవిషయమున) అనుభవమునకు తు.చ. తప్పకుండా సరిపోవుచున్నవి. అందువలననే వేంకటేశ్వర దైవజ్ఞుడు క్రింది శ్లోకమును పూర్వపారాశరిని ప్రశంసించు సందర్భమున వ్రాసికొనెను.
శ్లోll కలౌపారాశరీ హోరా ప్రత్యక్ష ఫలదర్శినీ
తదు క్తరీత్యానుమేయం జన్మకాల శుభాశుభమ్
గ్రహములకు ఆధిపత్యముచేతను, నైసర్గికముచేతను బలా బలములను నిర్ణయించుటకు ఈ గ్రంథమొక్కటియే యాధారము. కాని ఈ గ్రంథము (పూర్వపరాశరి)న నున్న పెద్దలోటు ఏమన, నైసర్గిక చేతను, ఆధిపత్యము చేతను నిర్ణయించిన గ్రహబలములు తిరిగి స్థితిచేతను, సంబంధము చేతను ఎట్లు మారి యోగావయోగముల నిచ్చుచున్నవో యను విషయమును గ్రంథకర్త వ్రాయ ప్రయత్నించి యుండక పోవుటయే. సర్వక్రతువు మొదలగు వ్యాఖ్యాతలైనను పై లోపమును పూర్తి చేసి యుండలేదు. వారి వ్యాఖ్యానములైనను సాంప్రదాయానుసారముగను, అనుభవమునకు సరిపడునట్లుగను లేవు. గ్రంథకర్తయగు పరాశరుని యభిప్రాయమును గూడ తేటతెల్లముగ విశదీకరించియుండలేదు. వీరి యభిప్రాయం కూడ నిర్ణీతములగు ప్రమాణసూత్రములుగా వచ్చియుండలేదు. మా వంశపరంపరగా వచ్చు సాంప్రదాయములను ఈ శాస్త్రముతో సంపుటిచేసి అనుభవములో వేలకొలది జాతకములను పరీక్షించి పై లోపమును పూర్తిచేసితిని. నేనీ గ్రంథమును అనుభవమునకు సరిపడునట్లుగాను, సాంప్రదాయ యుక్తముగాను అనేకములగు ఉదాహరణములు ద్వాదశ లగ్నముల క్రింద చెప్పినాను. పూర్వాపారాశరి యందలి మూల శ్లోకములను ఎక్కడి కక్కడ విమర్శించి అనుభవమునకు సరిపుచ్చుట కష్టసాధ్యమగుటచే సుమారు పది సంవత్సరములకుపైగా పట్టినది. - ఈ పుస్తకము నాలుగు ఖండములుగ విడదీసినాను.
1. యోగవళీ ఖండము
2. బాలారిష్ట ఖండము
3. ఆయుర్దాయ ఖండము
4. మిశ్రఫల ఖండము
ఇట్లు చేయుటకు కారణము పరాశరుడు చెప్పిన ముప్పది యేడు శ్లోకములలోను ఆరు శ్లోకములు మాత్రము ఆయుర్విషయమున చెప్పబడియున్నవి. ఈ ఆరు శ్లోకములను యోగభాగమునుండి విడదీసి ఆయుర్దాయ ఖండమున వివరించితిని. ఆయుర్దాయము గూర్చి వ్రాయుటకు ముందు బాలారిష్టములను వ్రాసిన గాని సాంప్రదాయము గాదను నాశయముచే బాలారిష్ట ఖండమును గూడ ప్రత్యేకముగ వ్రాసితిని. ఈ బాలారిష్టాధ్యాయమున మహర్షుల యొక్కయు వరాహమిహిరాదుల యొక్కయు మతమువలన మాత్రమే వ్రాసియున్నాను. జాతక నారాయణీయపు మొదటి భాగములోని బాలారిష్టాధ్యాయమున చెప్పబడిన యోగములు గాక అనేకములగు విశేషాంశములిందు పొందుపరచబడినవి. ఆయుర్విషయము గూడ నిట్లే నూతన విషయములనేకము లిందు వివరింపబడినవి. జాతక చంద్రికయందు వేంకటేశ్వర దైవజ్ఞునిచే కలుపబడిన నలుబది శ్లోకముల యందలి కొన్ని యంశములు గ్రాహ్యములగుటచే నా శ్లోకములను గూడ విమర్శించి ప్రత్యేకముగా మిశ్రఫల ఖండముగ వ్రాసియున్నాను.

- వాడ్రేవు సూర్యనారాయణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Yogavali Khandam Jataka Narayaneeyam 2