• Yogalaya
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యోగలయ

    Yogalaya

    Publisher: Yogaalaya

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

యోగలయల సమాహారం యోగజీవనం అయినప్పుడు ఈ యోగజీవన అంతస్సూత్రం ఏమిటి? బ్రహ్మేచ్ఛ, స్వతంత్రేచ్ఛ, సాధనేచ్ఛ - ఈ మూడింటి సమ్మేళనమే యోగజీవనం. ఈ మూడు యోగజీవన అంతర్లయలు. మన సాధనకు స్వతంత్రేచ్ఛ, సాధనేచ్ఛలు నేత్రద్వయాలయితే బ్రహ్మేచ్ఛ త్రినేత్రం అవుతుంది. పైకి కనిపించేవి స్వతంత్రేచ్ఛ, సాధనేచ్ఛలే అయినప్పటికీ కనిపించకుండా పరితపించేది బ్రహ్మేచ్ఛ గురించే. స్వతంత్రేచ్ఛ, సాధనేచ్ఛలతో బ్రహ్మేచ్ఛ ఐక్యమయితేనే యోగజీవనం పరిపూర్ణమయ్యేది.

బ్రహ్మం అంటే బ్రహ్మత్వం ... ఆ బ్రహ్మత్వాన్ని మన మానవత్వంలో లయింపచేసుకోవాలనే సంకల్పంతో స్వతంత్రించటమే బ్రహ్మేచ్ఛ. ఇక్కడ స్వతంత్రించటం అంటే స్వతంత్రసాధన. ఇక బ్రహ్మతత్వమూ మన మానవతత్వమూ వేరువేరు కాదన్న తెలివిడికి రావటం బ్రహ్మేచ్ఛ ఫలితాలు.

జీవితాన్ని తోలుబొమ్మలాటలా సాగించక, అంటే మన జీవితాన్ని నియంత్రించే అధికారాన్ని ఎవరికో అప్పజెప్పక మనకు మనంగా మన ఇచ్ఛానుసారం క్రమశిక్షణతో సంపూర్ణంగా స్వతంత్రజీవనం సాగించటం స్వతంత్రేచ్ఛ ఫలితం. అటు బ్రహ్మత్వ జిజ్ఞాస, ఇటు స్వతంత్రజీవన లాలస మన జీవితాల్ని, మన మనసుల్ని తొలుస్తుంటే ఒక తృష్ణ బయలుదేరి అది సాధనేచ్ఛగా పరిణామం చెందుతుంది.

నిరంతర సాధనే బ్రహ్మత్వాన్నీ, మనలనూ సంధానపరుస్తుంది. ఆ నిరంతర సాధన వల్లే బ్రహ్మతత్వమూ మనమూ ఒకటే అన్న స్పృహ కలుగుతుంది. ఇదే సాధనేచ్ఛ ఫలితం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Yogalaya