• Yekkadinundi Yekkadidaakaa
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎక్కడినుండి.? ఎక్కడిదాకా.?

    Yekkadinundi Yekkadidaakaa

    Publisher: Srijana Lokam

    Pages: 240
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమర్థుడైన రచయిత ఎప్పుడూ దార్శనికుడే. పౌరబాధ్యతనెరిగిన రచనాకారుడు తనున్న సమాజాన్నీ, తన పరిసరాల్నీ, పరిస్థితులనూ, సంక్షుభిత సందర్భాలనూ, సకల మానవ సంవేదనలనూ తన రచనల్లో ప్రస్ఫుటపరుస్తూ తను జీవిస్తున్న సమకాలీన స్థితిగతులకు ప్రాతినిధ్యం వహిస్తూనే తన తర్వాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ వెళ్తాడు. ఆ క్రమంలో తన సహమానవుల జీవితాలను ఉన్నతీకరిస్తూ, మెరుగుపరుస్తూ వర్తమాన సంక్లిష్టతలను విప్పి చెబుతూ, పాఠపరుస్తూ ఆరోగ్యకరమైన భవిష్యత్తును స్వప్నిస్తాడు. అందువల్ల వాస్తవదృష్టి గల రచయిత రచనల్లోనుండి రాబోయే కాలంలో పుట్టబోయే భావిపాత్రలు జీవం పోసుకుని సజీవమై మనముందు ప్రత్యక్షమౌతాయి. అందుకు నిదర్శనం..,

నేను 2009లో.. కొద్దికాలం అమెరికాలో ఉన్నప్పుడు ఈ నవలను రాశాను. ఆనాటి భారతదేశ సామాజిక పరిస్థితులను వ్యాఖ్యానిస్తూ సృష్టించిన పాత్రలు... కాలక్రమంలొ ఒక అరవింద్ కేజ్రీవాల్‌గా, ఒక నీరా రాడియాగా... ఇంకా ఇంకా ఎన్నో భారత జీవనవ్యవస్థను ఒక కుదుపు కుదిపి ప్రభావపర్చిన వ్యక్తులుగా రూపొంది.. జీవనరంగంలోకి నడుస్తూ వచ్చాయి. నేను ఈ నవలను రాసినప్పుడు వీళ్ళు లేరు, తర్వాత్తర్వాత వచ్చారు.

ఈ నవలను చదువుతున్నప్పుడు... దీంట్లోని అనేక పాత్రలు యిప్పుడు ఈ ఐదేళ్ళ తర్వాత మీ ముందే సంచరిస్తుండడం తెలుస్తుంది.

అందువల్ల దార్శనికత కల్గిన రచయిత కాలక్రమంలో ఒక 'చరిత్ర'గా మిగిలిపోతాడు. చరిత్ర ఎప్పుడూ కేవలం గతాన్ని మాత్రమే చెప్పదు. అంతర్లీనంగా భవిష్యత్ చిత్రపటాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.

- రామా చంద్రమౌళి

Preview download free pdf of this Telugu book is available at Yekkadinundi Yekkadidaakaa