-
-
యవనిక - రేడియో నాటకాలు
Yavanika Radio Natakalu
Author: Athaluri Vijayalakshmi
Publisher: Self Published on Kinige
Pages: 243Language: Telugu
రచనలల్లో ఎన్నో ప్రక్రియలున్నాయి. వాటిల్లో నాటకం రమ్యమైనదనీ పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఇందులో సంభాషణలుంటాయి. కథలోగాని, నవలలోగాని, జరుగుతున్నదాన్ని స్థితిని రాయొచ్చు. నాటక రచనలో సంభాషణ ద్వారానే అన్ని తెలియచేయాలి. నాటకంలోకూడ చదువుకునేది వేరు, ప్రదర్శించేది వేరు, వినేది వేరు. సంభాషణలే రేడియో నాటకాలకి ప్రాణం. ప్రతిదీ సంభాషణ ద్వారానే తెలియచెప్పాలి.
ఈ శ్రవ్య నాటకాల పుస్తకంలో జీవనసమరం, ది జడ్జిమెంట్, యవనిక, కాంతిపురం రైల్వేస్టేషన్, శ్రద్ధాంజలి, అమ్మదేవత, బలి మొదలైన నాటకాలున్నాయి. అన్నీ ప్రసారమైనవే. అన్నీ గంట నాటకాలే. విజయలక్ష్మిగారి దగ్గర సంభాషణ నడిపే చాతుర్యం కనిపిస్తుంది. కథావస్తువుల్లో దేనికది వేరు వేరు. జీవనసమరం ఉద్యోగాల మీద సమరం. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లితే అక్కడ అడిగే ప్రశ్నల తీరు మీద వ్యంగ్యం తొణికిసలాడింది. వ్యాపారం చేయాలంటే వచ్చే ఇబ్బందులు కూడ ఇందులో ప్రస్తావించారు.
'ది జడ్జిమెంట్' నాటకంలో పాత్రలు ఎక్కువ. ఇన్ని పాత్రలు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో పసిగట్టడం కష్టం. మాటి మాటికి ఆ పాత్ర పేరు పిలిచి మాట్లాడాలి. వింటున్నప్పుడు ఈ ఇబ్బంది ఉంటుంది కాని ఇక్కడ అచ్చులో చదువుకోవడంలో ఆ ఇబ్బంది ఉండదు. ఈ నాటకం న్యాయమూర్తి తీర్పు ద్వారా మంచి సందేశం అందిస్తుంది.
'శ్రద్దాంజలి' దేశం కోసం ప్రాణాలొడ్డే అమరవీరుల కథ. 'అమ్మదేవత' నాటకం అన్నింటికంటే మిన్నగాఉందని నా కనిపించింది. కల్పితమైనా కథనం బాగుంది. సాధారణంగా పాత్రలన్నీ ఒకేలా మాట్లాడుతాయి. ఒకే రచయిత రాస్తాడు కాబట్టి. విజయలక్ష్మి గారి రచనలో అది కనిపించదు. అన్ని పాత్రోచితంగానే పాత్రలు మాట్లాడుతాయి. నాటకాలమీద ఆసక్తి చదవడం మీద ఉత్సాహం ఉన్నవాళ్లని ఈ నాటకాలు హాయిగా చదివించేస్తాయి.
- రావికొండలరావు
