• Yatra Deepika Warangal Zilla
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యాత్రాదీపిక - వరంగల్ జిల్లా

    Yatra Deepika Warangal Zilla

    Pages: 180
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భగవంతుని పూజించటానికి పూర్వంనుండీ కూడా అనేక రాజులు, చక్రవర్తులూ, మహా పురుషులు అనేక ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల నిర్మాణం ఆ కాలంలో వాటిని నిర్మించినవారి అభిరుచికీ, ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలకు, ఆనాటి కళాకారుల అత్యద్భుత కళా ప్రతిభకి అద్దం పడుతుంటాయి. అందువల్లనే ఆలయాలు దైవ భక్తి ప్రేరితాలేకాదు, చారిత్రిక విశేషాలను తెలియజేసే అపురూప ఆధారాలుకూడా.

దక్షిణాదిన చోళులు, కళింగులు, కాకతీయులు మొదలగు రాజులు తమ తమ రాజ్యములలో తమ ఇష్ట దైవములకు ఆలయ నిర్మాణముగావించారు. తమ విజయగాధల సందర్భంగా నూతన ఆలయములు నిర్మించటం, లేక అంతకుముందే వున్న ఆలయాలను అభివృధ్ధిపరచటం చేశారు.

ఈ పుస్తకంలో వరంగల్ జిల్లా గురించి, అందులో కాకతీయులకాలంలో నిర్మింపబడి నేటికీ చెక్కుచెదరని నిర్మాణాల గురించి చెప్పారు రచయిత్రి.

తెలంగాణా ప్రాంతంలో హైదరాబాదు తర్వాత రెండవ పెద్ద నగరం వరంగల్. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాలు సరిహద్దులుగాగల వరంగల్ జిల్లాకి ముఖ్య పట్టణం వరంగల్. జంటనగరాలు హైదరాబాదు – సికిందరాబాదులలాగానే వరంగల్ కూడా మూడు పట్టణాల కూడలి. అవే వరంగల్, హనుమకొండ, ఖాజీపేట. కాకతీయరాజులకాలంలో ఓరుగల్లుగా, ఏక శిలా నగరంగా వైభవోపేతంగా విలసిల్లి నేడు వరంగల్‌గా ప్రసిధ్ధికెక్కింది.

ఈ జిల్లాలోని దేవాలయాలు, ఇతర దర్శనీయ స్థలాల గురించి చక్కగా వివరిస్తున్నారు రచయిత్రి. ఆయా ఆలయాల ఫొటోలు, ప్రాంగణ ప్రదేశాల బొమ్మలు చూస్తుంటే పాఠకులు కూడా తాము ఆ ప్రాంతాలలో తిరుగుతున్న అనుభూతిని పొందుతారు. చివరిదాక ఆసక్తిగా చదివించే పుస్తకం ఇది.

Preview download free pdf of this Telugu book is available at Yatra Deepika Warangal Zilla