• Yatra 1
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యాత్ర - 1

    Yatra 1

    Pages: 319
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

నీలోదరి కొండగుట్ట...

మహామాంత్రికుడు మరిడి సోమయ్య తన నివాసంలో దెబ్బతిన్న జంబూకంలా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి వున్నాడు శిష్యుడు మృణాళుడు.

అతడి వెనక విళంబి, వికేశి శిష్యులిద్దరూ ఉన్నారు. మిగిలిన శిష్యులు దూరంగా ఉన్నారు.

చివరి క్షణంలో చిలక శరీరం నుంచి తప్పుకుని ప్రాణాలు కాపాడుకున్న మృణాళుడు శునక శరీరంలోచేరి, తర్వాత కొంగ శరీరాన్ని ఆశ్రయించాడు. అయినా అతడి గగన ప్రయాణం సులువుగా సాగలేదు. దారిలో గాలి వాన కారణంగా ఆ రాత్రంతా ఒక చెట్టు గుబురు కొమ్మల్లో చలికి వణుకుతూ గడిపాడు. మరునాడు సాయంకాలానికి ఎలాగో నీలోదరి చేరుకున్నాడు.

కొంగ శరీరాన్ని వదిలి తన నిజశరీరంలో ప్రవేశించి జరిగిందంతా గురువుకు నివేదించాడు.

తన రెండో ప్రయత్నం కూడా బెడిసికొట్టడంతో మరిడి సోమయ్య చాలా అసహనంగా ఉన్నాడు. ఏం మాట్లాడ్డానికి శిష్యులకు ధైర్యం చాలటం లేదు.

“గురుదేవా... ఈ సారి నన్ను పంపించండి. ఎలా గొలా మరిన్ని విశేషాలు తెలుసుకుని వస్తాను” నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అడిగాడు శిష్యుడు వికేశి.

తల అడ్డంగా ఊపాడు మరిడి సోమయ్య. పచార్లు ఆపి ముగ్గుర్నీ సాలోచనగా చూశాడు.

“ఇక మీవల్లకాదురా. లాభంలేదు. మన ప్రయత్నాలు ఆచార్యుడికి తెలిసిపోయాయి. జాగ్రత్తపడిపోయాడు. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీలేదు. కొంతకాలం మౌనంగా ఉండటం మంచిది. మనముందు రెండే మార్గాలున్నాయి.

ఆయన ప్రయత్నాలు ఏమిటో ఆ చెక్క మందసంతో ఆయన ఏం సాధించబోతున్నాడో మనకు తెలియాలి లేదా వారి ప్రయత్నాలను మనం సమూలంగా నాశనం చేయాలి.

మొదటిది ఎలాగూ చేయలేకపోయాం. రెండో దానికి కొంత సమయం పడుతుంది. సరయిన సమయంలో సరైన దెబ్బకొట్టి నేనేమిటో నిరూపిస్తాను. ఇక దీని గురించి మర్చిపోయి మీమీ పనులు చూడండి” అని చెప్పి అక్కడ్నుంచి లోనకు వెళ్ళిపోయాడు.

Preview download free pdf of this Telugu book is available at Yatra 1
Comment(s) ...

Read the hardcopy of this book. Nice one and exactly in a similar way like the author’s others books.

Nice. Suryadevara takes us to Dwapara yuga journey with lot of details. Interesting read.