• Yamini Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యామిని కథలు

    Yamini Kathalu

    Author:

    Pages: 64
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వనజ, రామ్మూర్తి దంపతులు ఉన్నంతలోనే సర్దుకుపోతూ జీవించే తత్వం కలవారు.కూతురికి ఉన్నతవిద్య చెప్పించినా పెళ్లి చేసే క్రమంలో వత్తిడికి గురవుతుంటాడు రామ్మూర్తి. ఇలాంటి పరి స్థితులలో చిన్ననాటి స్నేహితుడు తనకుతానుగా వచ్చి రామ్మూర్తి కూతురిని తాను ప్రారంభించబోయే పాఠశాల నిర్వ హణ చేయమనడమే కాక కోడలిగా స్వీకరిస్తానని స్నేహితుడిని వత్తిడినుండి విముక్తుడిని చేస్తాడు.రామ్మూర్తికిది నిజంగా వరాల జల్లే! సుసాధ్యం కథలో భర్త కోరికను తీర్చాలని ప్రతి రూపాయిని దాచిపెట్టి ఐదువేలయాక విమానటికెట్టును ఖరీదు చేసి భర్తను విమానం ఎక్కించి సంబరపడ్డ ఇల్లాలి కథ.అనుకుంటే ఎవరికైనా అసాధ్యమనేదిలేదు కదా!ఇక ఆడవారికి డబ్బు తో ఏమి పని ఉంటుంది కాలసినవన్నీ ఆ ఇంటి పురుషుడే సమకూరుస్తుంటే అని అనుకోవద్దంటూ కొడుక్కు ఉత్తరం రాస్తుంది తల్లి.అత్తగారిని సమర్థిస్తూ కోడలు కూడా ఉత్తరం రాసిపెట్తుంది.భర్త ఆలోచనా విధానంలో మార్పు తెచ్చేదిశగా అత్త,కోడలు కలిసి వేసిన ప్రణాళిక ఈ కథ. తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తుపై ఎన్నోకలలుంటాయి, ఆశలుంటాయి. తాతయ్య కల కథలో జానకమ్మ, జానకిరామయ్యల కొడుకు సంపత్ చెడు సహవాసాలకు అలవాటుపడతాడు.అడిగినప్పుడు డబ్బులివ్వలేదని తండ్రినే కొట్టి జైలుపాలవు తాడు. చివరికి మనవడు తాతయ్య ఆకాంక్షలకనుగుణంగా అభివృద్ధిలోకి వచ్చి తాతయ్యకన్న కలలను సాకారం చేస్తాడు. ఇది చిన్న పిల్లలకు చదివి చెప్పాల్సిన కథ.మరో కథ పాత్రనెరిగి దానం. సౌమ్య,రమ్య చిన్నప్పటినుండి ఒకే చోట చదవడమే కాదు ఉద్యోగము కూడా ఒకే చోట సంపాదించుకుంటారు. చక్కటి స్నేహానికి అర్థం వీరు.సౌమ్యానికి మారుపేరు సౌమ్య.ఎదుటివారి కష్టాలకు కరిగేపోయే మనస్తత్వం సౌమ్యది.అయితే అపాత్రదానం చేయరాదని రమ్య హెచ్చరిస్తుంటుంది. ఈ క్రమంలో అబద్ధా లల్లి, ఫోనులో డబ్బులడుగుతూ మోసం చేయబోయిన వ్యక్తినుండి సౌమ్యను కాపాడుతుంది రమ్య. ఇలాంటి చిన్నవిషయాలే పెద్దమోసాలకు నాంది పలుకుతాయనే పరోక్షహెచ్చరికను పాఠకులకు అందిస్తారు హైమవతిగారు.మరి కథలు కూడా బ్రతుకు పాఠ్యాంశాలే కదా!

- సి. ఉమాదేవి

Preview download free pdf of this Telugu book is available at Yamini Kathalu