• Vyaktitva Vikasam Sootralu Sooktulu
  • Ebook Hide Help
    ₹ 36
    60
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వ్యక్తిత్వ వికాసం - సూత్రాలు సూక్తులు

    Vyaktitva Vikasam Sootralu Sooktulu

    Publisher: Yuva Bharathi

    Pages: 60
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనం ప్రేరణ లేకుండా ఏ పనీ చెయ్యం. ప్రతి పని వెనుకా ఆ పనిని చేయించే శక్తినే మనం ప్రేరణ అంటాం. యువకులలో నిద్రాణంగా దాగి ఉన్నశక్తిని జాగరితం చేసి, వారికి వ్యక్తిత్వవికాసం, సమయ నిర్వహణ, ప్రణాళికా రచన, క్రమశిక్షణ వంటి విషయాలను తెల్పి, వారికి వారు ఉపయోగపడాలని, తద్వారా వారి కుటుంబానికి, ఈ సమాజానికి, ఈ దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలనే సత్సంకల్పంతో మా యువభారతి దాదాపు పన్నెండేళ్ళుగా ప్రతినెలా ఉచిత వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాలకు ముఖ్య సూత్రధారిగా ఉంటూ నడిపిస్తున్న వ్యక్తి మా యువభారతి సమావేశకర్త ఆచార్య వంగపల్లి విశ్వనాథంగారు. ఈ కార్య క్రమ నిర్వహణకోసం వారెంతో శ్రమకోర్చి, అనేక పుస్తకాలను చదివి, అనేక మంది రచయితల నుండి విషయాలను గ్రహించి ‘అంతర్జాలం’ ద్వారా అనేక విషయాలను సంగ్రహించి, ‘యువభారతి పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ లెక్చర్‌ సీరిస్‌ ఫామ్‌ప్లెట్స్‌’ పేర దాదాపు 12 కరపత్రాలను అచ్చువేసి, ఉచితంగా యువకులకు అందజేయడం జరిగింది. ఆ కరపత్రాలను చదివి, ప్రభావితుడై మిత్రుడు డా॥ నాగినేని భాస్కరరావు గారు, ఆంగ్లంలో ఉన్న ఆ కరపత్రాలలోని సూక్తులను, సూత్రాలను తెలుగు పాఠక లోకానికి అందించాలనే సత్‌ సంకల్పంతో వాటిని అనువదించి ‘వ్యక్తిత్వవికాసం - సూత్రాలు, సూక్తులు’ అన్న ఈ చిన్న పుస్తకాన్ని వ్రాసి ‘యువభారతి’కి అందజేశారు.

‘వ్యక్తిత్వ వికాసం - సూత్రాలు సూక్తులు’ అనే ఈ పుస్తకం విభిన్న మనీషుల, మహనీయుల ఆంగ్ల వచనసూక్తులకు తెలుగు అనువాదం. ఈ సూక్తి సంపుటిలో మానవ జీవితాన్ని సమర్థం చేసే అంశాలూ, విజయసిద్ధికి మార్గదర్శకాలూ ఉన్నాయి. శ్రీయుతులు జిమ్‌ ఎలెన్‌ సూక్తులూ రాల్ఫ్‌మార్స్‌టన్‌ సూక్తులూ ఉన్నాయి. కొన్ని స్వామి వివేకానంద సూక్తులు, శ్రీరమణ
మహర్షి సూక్తులు, శ్రీ సత్యసాయిబాబా సూక్తులు కూడా ఇందులో చేర్చబడ్డాయి. ఈ సూక్తులన్నీ మానవ జీవిత వికాస పథంపైన వెలుగులు ప్రసరించేవే.

Preview download free pdf of this Telugu book is available at Vyaktitva Vikasam Sootralu Sooktulu