• VrataNirnayaKalpaValli
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వ్రతనిర్ణయకల్పవల్లీ

    VrataNirnayaKalpaValli

    Pages: 325
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“వ్రతనిర్ణయ కల్పవల్లి” యను ఈ గ్రంథ రాజమును విజయనగర సంస్థానాస్థాన సిద్ధాంతులు, బహుశాస్త్ర పురాణేతిహాసాదులంద పరిమిత పాండిత్య ప్రకర్షకలవారు, దేశప్రసిద్ధ పిడపర్తి వంస సంజాతులు శివరామ సుధీవరుల కుమారులగు శ్రీ సీతారామశాస్త్రి గారు 1778 వ శాలివాహన శకమందు (1856 ఇంగ్లీషు సంవత్సరము) సంస్కృత భాషలో రచించిరి. మరియు దీనితోపాటు ‘పంచాంగ పీఠికా లేఖనప్రక్రియా’ యను మరొక గ్రంథమును కూడ రచించిరి. ఈ రెండు గ్రంథములు పంచాంగ గణితము చేయు పంచాంగ కర్తలకత్యంతోపకారకములను భావముతో మా గురు పరంపర వలన నావద్దకు వచ్చిన తాళపత్ర గ్రంథములను తిరుపతిలో గల “రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠము”లో వ్యాకరణాచార్యలు, మాకు మిత్రులగు శ్రీ శ్రీపాద సత్యనారాయణమూర్తి గారి సహకారముతో ”విద్యాపీఠము” ద్వారా సంస్కృతములో 1929వ శా.శ. సంవత్సరములో (2007 క్రీ.శ.) అచ్చు వేయించడమైనది. సంస్కృత భాషలో నన్ను ఈ గ్రంథములో గల అంశములు పంచాంగకర్తలకు మాత్రమే గాక సామాన్య జనులకు, పురోహితులకు, సంస్కృత భాషలో ప్రవేశములేని వారికి కూడా సుబోధకముగ నుండునట్లు చిరంజీవులైన డా.ఎం.ఆర్.వి.శర్మగారి సహకారముతో తెలుగులోనికి అనువాదములు చేసితిని. ఈ గ్రంథము ననుసరించి తిథి నిర్ణయములు, చైత్రాది ద్వాదశ మాసములంద గల పర్వదిన, పుణ్య దినాదుల నిర్ణయములను స్వయముగ తెలుసుకొనుట కెక్కువ అవకాశము కలదు. ఆస్తికులందరు యీ గ్రంథమును సంపాదించి సద్వినియోగ పరచుకొనగోరుచున్నాను.

- మధుర కృష్ణమూర్తి శాస్త్రి