• Voori Chivara
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఊరి చివర

    Voori Chivara

    Author:

    Publisher: Palapitta Books

    Pages: 144
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

అఫ్సర్‌ పాతికేళ్ళ కవిత్వ ప్రయాణంలో వివిధ మలుపులున్నాయి. వివిధ దశలున్నాయి. 'రక్త స్పర్శ' ఒక స్వతంత్రమైన కార్యాచరణ. తెలుగు కవిత్వ సీమలోవైవిధ్యానికి తెరలెత్తిన కొత్త సంతకం. ఆ తర్వాత కాలాన అఫ్సర్‌ ప్రయాణంలో 'ఇవాళ' నుంచి ఇప్పటి 'ఊరి చివర' వరకు గమనిస్తే సమాజాన్ని, ప్రపంచాన్ని కదిపి కుదిపిన సంఘటనల ప్రతిస్పందనల ఆనవాళ్ళు అనేకం కనిపిస్తాయి. ఈ కాలాన సమాజాల్లో, సంస్కృతుల్లో, జీవనవిధానాల్లో, ఉద్యమాల్లో పెనుమార్పులు ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. కొత్త దృష్టితో, కొత్త పరికరాలతో వీటిని చూడటం, అంచనా వేయటం, కవిగా తన వ్యక్తీకరణలను సానబెట్టుకోడంలో ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా వ్యవహరించం అఫ్సర్‌ కవిత్వ తాత్వికధారలో మేలిమి అంశం.

తెలంగాణ-ఆంధ్ర-అనంతపురం-అమెరికాల మధ్య గించిన జీవితానుభవం అఫ్సర్‌ కవిత్వశైలికి జీవశక్తిని, పరిపుష్టిని ఇచ్చాయి. ప్రయాణించడం, పర్యటించడం సృజనకారుని దృష్టికి విశాలత్వాన్ని, వ్యక్తీకరణకి వైశాల్యాన్ని అందిస్తాయి. ఇది అఫ్సర్‌కి సరిగా వర్తించే అంశం. తెలంగాణ- ఆంధ్రలలోని వైరుధ్యాలనే కాదు, అమెరికాలో తెల్ల, నల్లజాతుల మధ్య వైరుధ్యాలని దగ్గరగా చూశారు. ఆఫ్రికన్‌ అమెరికన్లతో, నైజీరియా, కీన్యా లాంటి దేశాల నల్లజాతి విద్యార్థులతో సంభాషించడం, వారి విషాదానందాల్లో భాగస్వామి కావడం అఫ్సర్‌ కవితావస్తువులో, అభివ్యక్తిలో విస్తృతికి తావునిచ్చాయి. డయాస్పోరాకి సంబంధించిన అంశాలే కాదు, అంతార్జాతీయ దృష్టిని సంతరించుకున్న లక్షణాలు అఫ్సర్‌ కవిత్వంలో కనిపిస్తాయి. ప్రాపంచిక వాస్తవాల్ని గమనిస్తూ, కల్లోల సందర్భాల్లోని ఉద్విగ్నతల్ని సృజనాత్మకంగా వ్యక్తం చేయడంలో అఫ్సర్‌ ఊహాశాలిత బలీయమైంది. ఈ పుస్తకంలోని కవితలనేకం ఇందుకు తార్కాణం.

- గుడిపాటి

Preview download free pdf of this Telugu book is available at Voori Chivara