• Viswavikhyata Baladhyulu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 181.56
    213.6
    15% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విశ్వవిఖ్యాత బలాఢ్యులు

    Viswavikhyata Baladhyulu

    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విశ్వవిఖ్యాత బలాఢ్యులు

కేకలతూరి క్రిష్ణయ్య

ఈ పుస్తకంలో క్రీడలలో ప్రవేశ వయస్సు, ఎవరు ఏ క్రీడలలో రాణించుతారు అనే వివరములు, అన్ని వయసుల సాధారణ వ్యక్తులు మరియు క్రీడాకారులు చేయవలసిన వ్యాయామాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆరోగ్య నియమాలు వివరించబడినవి.

యుద్ధ క్రీడ (మార్షల్ ఆర్ట్స్) లయిన మల్లయుద్ధము, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, యోగ విద్య, కర్రసాము, కరాటే విద్యల పుట్టుక, పూర్వ చరిత్ర వాటి సాధనాంశములు, సాంకేతికపరమైన సూక్ష్మాలు సంబంధించిన బొమ్మలతో సహా వివరంగా తెలపడమైనది. అదియును గాక మహా బల సంపన్నులు "కలియుగ భీముడు" అయిన కోడి రామ్మూర్తి గారు దేశ విదేశాలలో ప్రదర్శించిన బల ప్రదర్శనల గురించి తెలపడమైనది. కుస్తీలలో విశ్వవిజేతయై, తనకు 70 సంవత్సరముల వయస్సు వచ్చినా ప్రపంచ యోధులకు సవాలు విసిరిన "గామా పహిల్వాన్" విన్యాసాలు, అతని చరిత్ర, అతనికి ధీటైన పోటీ ఇచ్చిన "రహిం సుల్తాన్ వాలా" "స్టాన్సిలస్ జిబిస్కో"ల గురించి వివరించడమైనది.

బాక్సింగ్ రారాజులైన మహ్మదాలి, హోలీఫీల్డు, టైసన్, లునెక్స్ లూవీస్‌ల గురించి బాడీ బిల్డింగ్ ఏడుసార్లు మిస్టర్ యూనివర్స్ విజేత ప్రఖ్యాత టెర్మినేటర్ హీరో, ప్రస్తుత అమెరికా స్టేట్ గవర్నరైన ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ మరియు ఒకమారు మిస్టర్ యూనివర్స్ అయిన ప్రస్తుతం 97 సంవత్సరాల వయస్సులో వ్యాయామం చేస్తూ 54 అంగుళముల రొమ్ము, 23 అంగుళముల నడుము కొలతలు కలిగిన "మనోహర్ ఏచ్" గురించి, గొప్ప ప్రపంచ రికార్డులు సాధించిన రష్యా వెయిట్ లిఫ్టర్స్ గురించి, కరాటే విద్యకు ప్రపంచ ప్రఖ్యాతి గలిగేట్లు చేసి, అద్భుత శక్తి కనబరిచిన "బ్రూస్లీ" గురించి, కర్రసాము, విలువిద్య గురించి వాటిలో ప్రఖ్యాత వ్యక్తుల గురించి వివరించటం జరిగింది.

క్రీడా వ్యాయామంలోను, ఆరోగ్యపరమైన క్రీడాంశాలు పొందుపరిచినందుకు క్రీడాకారులకు, సామాన్యులకు మార్గదర్శి కాగలదని నమ్ముచున్నాను.

కేకలతూరి క్రిష్ణయ్య

Preview download free pdf of this Telugu book is available at Viswavikhyata Baladhyulu