• Viswanatha Satyanarayana Novels Complete Set NRI Edition
  • fb
  • Share on Google+
  • Pin it!
 • కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సంపూర్ణ నవలా సాహిత్య నిధి హార్డ్‌బౌండ్ ఎడిషన్

  Viswanatha Satyanarayana Novels Complete Set NRI Edition

  Pages: 10625
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description


వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో "అపూర్వసృష్టి" చేసి తెలుగువారికి తొలి "జ్ఞానపీఠాన్ని" అందించిన శ్రీ విశ్వనాథవారి సంపూర్ణ సాహిత్యాన్ని "సముద్రితం"గా పాఠక మహాశయులకు అందించాలన్న సంకల్పంతో ఈ నవలా తోరణం. ఇది ప్రత్యేకంగా ఆర్ట్ పేపర్ పై ముద్రించబడి, హార్డ్‌బౌండ్ తో రూపొందించబడిన లిమిటెడ్ ఎడిషన్ నవలల సెట్.

 • దాదాపు 10,625 పేజీల్లో "అపూర్వ విజ్ఞానం"
 • 50 పుస్తకాలుగా 57 నవలలు
 • గుండ్రంగా స్పష్టంగా కనపడే అక్షరాలు
 • సులభంగా చదవడానికి తగినంత దూరంలో వరుసలు
 • మాటమాటకీ మధ్య అవసరమైనంత విరామం
 • భావానుగుణంగా చదువుకోడానికి వీలుగా చిహ్నములు
 • నవలలన్నీ ఒకే మొత్తంగా లభ్యము

 ఈ సెట్‌లో లభించే చారిత్రక నవలలు:

1. భగవంతుని మీది పగ 16. దూతమేఘము
2. నాస్తికధూమము 17. లలితా పట్టణపు రాణి
3. ధూమరేఖ 18. దంతపు దువ్వెన
4. నందోరాజా భవిష్యతి 19. యశోవతి
5. చంద్రగుప్తుని స్వప్నము 20. పాతిపెట్టిన నాణెములు
6. అశ్వమేధము 21. మిహిరకులుడు
7. అమృతవల్లి 22. సంజీవకరణి
8. పులిమ్రుగ్గు 23. కవలలు
9. నాగసేనుడు 24. భ్రమరవాసిని
10. హెలీనా 25. ఏకవీర
11. వేదవతి 26. ధర్మచక్రము
12. నివేదిత 27. కడిమిచెట్టు
13. దిండుక్రింది పోకచెక్క 28. వీరపూజ
14. చిట్లీ చిట్టనీ గాజులు 29. స్నేహఫలము
15. సౌదామిని 30. బద్దన్నసేనాని

 ఈ సెట్‌లో లభించే సాంఘిక నవలలు:

31. వేయిపడగలు 45. పునర్జన్మ
32. స్వర్గానికి నిచ్చెనలు 46. పరీక్ష
33. తెఱచిరాజు 47. నందిగ్రామ రాజ్యం
34. మ్రోయుతుమ్మెద 48. బాణావతి
35. సముద్రపు దిబ్బ 49. అంతరాత్మ
36. ఆఱునదులు 50. గంగూలీ ప్రేమకథ
37. చెలియలికట్ట 51. చందవోలు రాణి
38. మాబాబు 52. ప్రళయనాయుడు
39. జేబుదొంగలు 53. హాహాహుహు
40. వీరవల్లడు 54. దమయంతీ స్వయంవరం
41. దేవతల యుద్ధము 55. నీలపెండ్లి
42. వల్లభమంత్రి 56. శార్వరి నుండి శార్వరి దాక
43. విష్ణుశర్మ ఇంగ్లీషుచదువు 57. కుణాలుని శాపం
44. పులుల సత్యాగ్రహం


"సర్వశ్రేయో కాంక్షితమైన భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ఔన్నత్యాన్ని, భరతజాతి ఆత్మశక్తి చైతన్యాన్ని, శాస్త్ర విజ్ఞాన ప్రాభవాన్ని, సార్వకాలిక ప్రమాణాధారిత. చారిత్రక సత్యాలని ఆవిష్కరిస్తూ, అనేక సాహిత్యప్రక్రియారూపాలలో, ఆకారం దాల్చిన విశ్వవిద్యాలయాలు శ్రీ విశ్వనాథవారి సాహితీ సుమాలు".


ఇటువంటి సువర్ణావకాశాన్ని, ఆంద్రసాహితీ జగత్తులో తరగని ఈ నిధిని మీ సహృదయతకి చిహ్నంగా చిరకాలం మేరుశిఖరంలా, మీ ఇంటి గ్రంథాలయానికి ప్రత్యేక ఆభరణంగా అలంకరించుకోండి. ఈ సంపదను "అపురూపంగా" భద్రపరచి "భావితరాలకు" అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

- విశ్వనాథ పావని శాస్త్రి

.


గమనిక:
ఇది విశ్వనాథ సత్యనారాయణగారి నవలల సెట్ మాత్రమే. విశ్వనాథగారి ఇతర రచనలు - "విశ్వనాథ అసంకలిత సాహిత్యం-సంపుటం-6"; "విశ్వనాథ అసంకలిత సాహిత్యం - సంపుటం-2"; "విశ్వనాథ అసంకలిత సాహిత్యం - సంపుటం-3"; "శ్రీ విశ్వనాథవారి సంపూర్ణ నాటక సాహిత్య నిధి"; "శ్రీ విశ్వనాథవారి సంపూర్ణ విమర్శగ్రంథ నిధి"; "కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి ఆత్మకథ, లఘుకావ్యాలు" - ఈ సెట్‌లో భాగం కాదని గమనించగలరు.

Comment(s) ...

ఇది అన్యాయం. NRI కాపీకి RI కాపీకి ఇంత తేడానా?
NRIలలో కూడా సాహిత్యాభిరుచిలో ధనికులై, ధనంలో బీదలై వుంటారయ్యా!

Sir,

Please re-release the version కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సంపూర్ణ నవలా సాహిత్య నిధి.
కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సంపూర్ణ నవలా సాహిత్య నిధి హార్డ్‌బౌండ్ ఎడిషన్ price looks ridiculously high for Normal Readers like me.

Appreciate your effort in bringing the writings of Sri Viswanatha Garu.

Thank you,
Venkatesh

Hi,

Could you please let us know if this can be shipped to USA?
[Admin]Yes. Kinige do ship print books to USA and other countries. [/Admin]

Regards,
Rama Krishna

sorry for type error above, i mean soft copy (ebook)?

Hi i live in Dallas, TX. How i can get these books? you can send me as books to my address? or soft code (ebook)?