• Viswanatha Satyanarayana Critique Complete Set
 • Print Book Help
  Out of stock
  • fb
  • Share on Google+
  • Pin it!
 • శ్రీ విశ్వనాథవారి సంపూర్ణ విమర్శగ్రంథ నిధి

  Viswanatha Satyanarayana Critique Complete Set

  Pages: 1330
  Language: Telugu
  Rating
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  '1/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ఈ సెట్‌లో లభించే పుస్తకాల గురించి:

కల్పవృక్ష రహస్యములు

ఎవరు వ్రాసిన గ్రంధానికి వారే వ్యాఖ్యానము వ్రాయుట యెక్కువగా లేదు. లేకను పోలేదు. నేనీ కల్పవృక్షమును వ్రాసినాను. ఏ కవి ఏ గ్రంధమును వ్రాసినను అదియే మహా గ్రంధమనుకొనుటయు, నొక్కొక్కప్పుడు తన ముందు కాళిదాసు కూడ పనికిరాడనుకొనుటయు, లోకములోని కవుల లక్షణము ఆ కవి ఎట్టివాడో, యెంతవాడో, భవిష్యత్తులో పండితులను భావుకులను నిర్ణయించుటమీద నాధారపడియుండును. సామాన్యుల యభిప్రాయములకును గ్రంథముయొక్క యౌన్నత్యమునకు సంబంధముండును.

ఇది యిట్లుండగా ఒక్కొక్క కథ తీర్పు ఒక్కొక్క పద్యము చేయుటలోని నేర్పు ఒక భావము నందలి మార్పురచనా శిల్పము అలంకారముల క్రొత్త దనము, తనకు తోచిన భావములను కొన్నింటిని గూఢముగా నిక్షేపించుట, కొన్ని పైకి భాసించునట్లు చేయుట, కొన్నింటిని వాచ్యము చేయుట, ఎచ్చట నేది ఆ కవికి ఔచిత్యమనిపించునో అతడట్లు చేయును. పాఠకునకు సర్వము తెలియకపోవచ్చును.

“జీవతః కవేః ప్రష్టవ్యమ్” అన్న నానుడి యిందుకే పుట్టినది. ఆ ప్రష్టవ్యములను కొన్నింటిని ”కల్పవృక్షరహస్యము” లన్న పేరుతో వ్రాయుచుంటిని.

పలుమంది ఈ కావ్యము బహు రహస్య గర్భితము. వ్యాఖ్యాన సాపేక్షము ననుచుండుటచేత నేనీ పనిచేసినచో కొందరు పండితులకు, కొందరు భావుకులకు కొందరు సామాన్యులకు గ్రంథము చదువవలసిన పద్ధతి, కవి యర్థములను నిక్షేపించెడి మార్గము, శిల్పవిషయములను గ్రథనము చేయు మర్మములు కొన్ని తెలియగలవు. ఇది మార్గ దర్శినిగా నుండును.

- విశ్వనాథ సత్యనారాయణ

సాహిత్య సురభి

ఈ సాహిత్య సురభి ఒక విలక్షణమైన పుస్తకము. ఇవి రకరకాలైన పద్యములు. ఇవి సుమారు 300 పద్యములు. కొన్ని పద్యములు ధర్మమును చెప్పును. కొన్ని సామాన్య అర్థమును చెప్పును. కొన్నింటిలో లోతైన వేదాంతార్థము లుండును. కొన్నిటిలో శాస్త్రార్థముండును. కొన్నిటిలో సాహిత్యపు లోతులుండును.

ఈ మూడువందల పద్యములు పనిపెట్టుకొని మాటిమాటికి చదువుచున్నచో, వ్రాసిన వ్యాఖ్యానములు తెలిసికొన్నచో, ప్రతివాడును సామాన్యమైన ఆంధ్రభాషావేత్తయగును. వానిని పండితుడు అని అనవచ్చును. అతనికి బహువిషయాలు తెలియును. అతడు కవుల కవిత్వమును విని కావ్యములు చదివి, తనకు తెలియలేదన్న దుస్థితిలో నుండును. కాని పట్టుకుని తిరిగి,తిరిగి చదువు చుండవలయును.

నేటి దేశమున మన యాంధ్రభాషా జ్ఞానమును ప్రజలలో సముద్ధరించుటకు చేసిన ప్రయత్నమిది.

- విశ్వనాథ సత్యనారాయణ

అల్లసాని వాని అల్లిక జిగిబిగి

మా నాయన కవిసమ్రాట్ శ్రీవిశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన “అల్లసాని వాని అల్లిక జిగిబిగి” అనే యీ విమర్శన రచనాకాలము 1958 కావచ్చును. ఇది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానదిగ్గజము, ఆంధ్రకవితా పితామహుడైన అల్లసాని పెద్దన్నగారి కథాకథన శిల్పవైభవ విమర్శనము. ఇద్దాని చదివి, పెద్దన్నగారి మనుచరిత్రమును చదివిన కథ యందలి పరమార్థము, కావ్యకళావిశేషములు సుగ్రాహ్యము కాగలదు. ఇది నవభారతి పత్రికలో 1958 జూన్ నుండి వరుసగా ఎనిమిది నెలలు ప్రచురించబడినది. దీని ప్రథమముద్రణ 1961.

- విశ్వనాథ పావనిశాస్త్రి

ఒకడు నాచన సోమన్న

మా నాయన కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన “ఒకడు నాచన సోమన్న” అనే యీ విమర్శన రచనాకాలము 1960. ఇది, ఉత్తరహరివంశ కావ్యకర్త నాచనసోమన్న రసపరిజ్ఞాన వైశిష్ట్య విమర్శనము. ఇది చదివిన, సోమన్న ఉత్తరహరివంశ కావ్యమును సులభముగా చదివి నర్థము చేసికొనుటకు యంతేని ఉపయుక్తము. దీని ప్రథమ ముద్రణము- 1970.

- విశ్వనాథ పావనిశాస్త్రి

కావ్యపరీమళము

మా నాయనగారు కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు యీ “కావ్యపరీమళము” ను 1969లో రచించిరి. దీని ప్రథమ ముద్రణ 1970. ఇది, తెలుగు సాహిత్యములో యత్యంత పరిమళ భరితమైన ప్రబంధ రచనా తత్వావిష్కరణతో, తెలుగుభారతికి సూత్రీకరించి యలంకరించిన ఏకాదశ సుమమాల.

- విశ్వనాథ పావనిశాస్త్రి

కావ్యానందము

మా నాయనగారు కవిసమ్రాట్ శ్రీవిశ్వనాథ సత్యనారాయణ గారి “కావ్యానందము” అనే యీ విమర్శన రచనాకాలము 1970-71లలో కావచ్చును. ఇది “సాహిత్య మీమాంస” గ్రంథము. దీని ప్రథమముద్రణము 1972.

- విశ్వనాథ పావనిశాస్త్రి

శాకుంతలము యొక్క అభిజ్ఞానత

మా నాయనగారు కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన “శాకుంతలము యొక్క అభిజ్ఞానత” అనే యీ విమర్శన రచనాకాలము 1958-59. మహాకవి కాళిదాసుని “అభిజ్ఞాన శాకుంతలము” సర్వ వేద వేదాంత సారము, శివాద్వైత ప్రతిపాదన గ్రంథము. ఈ విమర్శన గ్రంథము, సంస్కృతభాషా భినివేశము స్వల్పముగా కలిగిన వారికైనను మహాకవి
కాళిదాస కృత శాకుంతలా కావ్య మూలము సులభముగా నర్థము చేసికొనుటకు కరదీపిక కాగలదు. దీని ప్రథమ ముద్రణము 1961.

- విశ్వనాథ పావనిశాస్త్రి

శ్రీ విశ్వనాథ సాహిత్యోపన్యాసములు

మా నాయనగారు కవిసామ్రాట్ శ్రీవిశ్వనాథ సత్యనారాయణగారు ఆంధ్ర సారస్వత పరిషత్తు అభ్యర్థనపై 1964 అక్టోబరు 27,28,29, తేదీలలో కావించిన మూడు ఉపన్యాసములను, బి.హెచ్.ఇ.ఎల్ కాలనీ ప్రాంగణములోని శ్రీపద్మావతీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో ఉపన్యసించిన “సీతాయాశ్చరితం మహత్” అను ఉపన్యాసమును కూడ నిందు పొందుపరిచితిమి.

- విశ్వనాథ పావనిశాస్త్రి

నన్నయ్యగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి

మా నాయనగారు కవిసమ్రాట్ శ్రీవిశ్వనాథ సత్యనారాయణ గారు, “ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి” యని శ్రీమద్రామాయణ కల్పవృక్షము నందు వ్రాసిరి. గురుపద్యవిద్యకు నాద్యుడైన నన్నయభట్టారకుని అనంతముఖ కవితాశిల్పమును సువిదితము చేసిరి విశ్వనాథవారు. ఈ గ్రంథ పఠనముచేత ఆదికవి విరచిత ఆదికావ్య కథారహస్యము యెఱుకకు వచ్చును.
“నన్నయ్యగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి” అనే యీ విమర్శన రచనాకాలము 1948-49. దీని ప్రథమ ముద్రణ 1954లో. ఈ విమర్శనము 1949లో భారతి పత్రికలో ధారావాహికముగా ప్రచురింపబడినది.

- విశ్వనాథ పావనిశాస్త్రి

నీతిగీత

పితామహులైన కవిసామ్రాట్టు విశ్వనాధ సత్యనారాయణగారు భర్తృహరి సుభాషితములకు సుభాష్యమును వ్రాసిన తీరు మహోన్నతము. వారి మార్గము “బ్రహ్మమార్గము” బ్రహ్మయనగా సృష్టి. ఈ వ్యాఖ్యానమందున్న విశేషమేమనగా శ్రీ భర్తృహరి వ్రాసిన ప్రతి శ్లోకము నొక కథవలె కూర్చి ఒక సవ్యాఖ్యానమును అందించెను. వ్యాఖ్యాన మనిని ఇట్లుండవలె. ఈ నీతిగీతను చదివినచో యందనే కానేక విషయములను గ్రహించి, వాటిని ఆచరించినచో జీవితము నీతి రీతిగా సాగును- అది ఇహపర సౌఖ్యములను కొనితెచ్చును.

- విశ్వనాథ సత్యనారాయణ

Comment(s) ...

"Ramayala Kalpavruksham" print lo unte link teliyacheyagalaru !!!