-
-
విశ్వనాథ సాహితీ సూత్రం జీవుని వేదన
Viswanatha Sahiti Sutram Jeevuni Vedana
Author: Dr. Dhulipala Srirama Murthy
Publisher: J. Venkateswara Rao
Pages: 128Language: Telugu
‘జీవుని వేదన’ సాహితీ సూత్రంగా శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు రామాయణ కల్పవృక్షంలో ఆవిష్కరించారు. సంకల్పావధిగా ‘రామాయణ కల్పవక్షము’ను సృష్టించినప్పటికిని ‘జీవుని వేదన’ తత్త్వాన్ని వారు సాహిత్య, కావ్యశాస్త్రాల భూమిక మీద విశ్లేషించి సిద్ధాంతకరించలేదు.ఆ బాధ్యతను నిర్వహించినవారు శ్రీ ధూళిపాళ శ్రీరామమూర్తిగారు. వారు కవిగారితో సన్నిహితంగా మెలిగారు. వృత్తిరీత్యా కూడ సహచరులు. రామాయణ కల్పవృక్షానికి వారు ప్రథమ శ్రోత `` ఎప్పటికప్పుడు కవిగారి రచనలు వారి ముఖతః వినిన ధన్యులు. అలంకారశాస్త్రం వారే కళాశాలలో విద్యార్థులకు బోధించేవారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి సాహిత్య ప్రవృత్తిని వివరించటానికి తగిన సామర్థ్యం, అవకాశం కలవారు. ‘జీవుని వేదన’ విషయముపై వారు వ్రాసిన పది వ్యాసాలలో ఎనిమిది వివిధ సాహిత్య పత్రికలలో కవిగారు ఉన్నప్పుడే ప్రచురించబడినవి.
భావాతీతము, అలౌకికము, నిత్యము అయిన సత్పదార అన్వేషణే జీవుని వేదన. లోకోత్తరమైన సాహిత్య సృష్టికి ‘జీవుని వేదన’ మూలధాతువు.ఇది మహర్షితుల్యులైన వాల్మీకి భాస కాళిదాస భవభూతులలో ఏవిధంగా ప్రస్ఫుటంగా కనబడుతుందో విశ్లేషించారు శ్రీ రామమూర్తిగారు. దానిని శ్రీ విశ్వనాథ రచనలలో, ముఖ్యంగా రామాయణ కల్పవృక్షంలో అంతర్వాహినిగా ఎట్లా ఉన్నదీ వివరించారు. సాహిత్య వివేచనలో ఒక నూతన దృక్పధాన్ని విశదీకరించిన వారి వ్యాసాలు అమూల్యమైనవి. చెల్లాచెదురుగా అజ్ఞాతంలో ఉండిపోయినవి. వాటిని ప్రచురించి వెలుగులోనికి తీసికొనిరావటం - ఆ మహాకవికి, ఆ సాహిత్య విమర్శకునికి నేనర్పించే ‘నివాళి’.
- జవంగుల వెంకటేశ్వరరావు
