• Viswa Putrikanu Nenu Viswasanti Naa Akanksha - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • విశ్వపుత్రికను నేను విశ్వశాంతి నా ఆకాంక్ష (free)

    Viswa Putrikanu Nenu Viswasanti Naa Akanksha - free

    Pages: 49
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నాకు చిన్నతనం నుండి విశ్వమంటే ఎంతో అభిమానం, ఆసక్తి. రాత్రిపూట ఆకాశంలోకి చూడడం చుక్కలను లెక్కపెట్టడం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ నా చిన్ననాటి నేస్తాలు నాకు అద్భుతాలు. భూమిపై పడుకుని ఆకాశంలోకి చూసే మనమంతా విశ్వంలో భాగం అనే భావన చాలా అద్భుతం. విశ్వంపై అభిమానంతోపాటు నాలో విశ్వజనీనత భావాలు స్కూలులో చదివే రోజుల్లో బీజాలు పడ్డాయి. నాకు చిన్నప్పటినుండి భావుకత, కవితలపై మక్కువ ఎక్కువ. మా ఇంటి వాతావరణం, మా నాన్న, అమ్మల విశాల దృక్పథం మాలో విశాల భావాలను, ప్రపంచ ప్రజలమంతా ఒక్కటే అన్న మా నాన్నగారి ఆలోచనా విధానం నాపై ఎక్కువ ప్రభావం చూపింది. ఆ స్పూర్తితో నా కలానికి ‘విశ్వపుత్రిక’ అని నామకరణం చేసుకున్నాను. ఈ ఆధునిక యుగంలో విశ్వజనీనత (universalism) ఆవస్యకత ఎంతో ఉంది. ఈ తరం ప్రజలు, యువతీయువకుల్లో ప్రాపంచిక వస్తువుల విషయాలే జీవితమనే భావన ప్రబలంగా ఉంది. వస్తు విషయ కాంక్షలో ప్రజలు పరస్పరం ప్రేమ, ఇతరులను గురించి పట్టించుకోవడం మరచి మానవీయ విలువలు లేక మానవ సంబంధాలు కుంటు పడుతున్నాయి.

ఆధ్యాత్మిక అవగాహన, మానవతా దృక్పథం 'విశ్వజనీనత'కు మూలాధారమని ప్రముఖ తత్వవేత్తల అభిప్రాయం. 'విశ్వజనీనత' భావాలు నాగరికతకు కొలమానంగా భావిస్తారు. నాగరికత శాస్త్ర విజ్ఞానం కంటే ముందంజ వేయాలని, మనుషుల్లో వ్యతిరేక వికృత భావాలను తొలగించి నవ నాగరికతవైపు నడిపించే ప్రయత్నం చేయడం సాహిత్యం, కళల ప్రధమ కర్తవ్యమని వీరి అభిప్రాయం. సమకాలీన సాహిత్యం 'విశ్వజనీనత', 'వసుధైక కుటుంబ' భావాలను ప్రపంచ ప్రజలలో ప్రచారం చేయడం ఎంతో అవసరం.

ప్రాచీన భారతీయ సాహిత్యం, కళలు విశ్వజనీన దృక్పథాన్ని చాటుతున్నాయి. ఉపనిషత్తులు, గీత, యోగ ఈ విశ్వం దేవుని చైతన్య స్వరూపమే అని, సర్వజీవ నిర్జీవ స్వరూపాలు ఆ విశ్వ చైతన్యంలోని భాగాలనే భారతీయ ఆధ్యాత్మిక ఆలోచనా విధానం విశాల దృక్పధాన్ని పెంపొందిస్తుంది.

ప్రఖ్యాత పాశ్చాత్య కవులు T.S. Eliot, R.W.Emerson భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి పాశ్ఛాత్యులు ప్రతిపాదించిన transcendentalism కు గల సారూప్యాన్ని గ్రహించారు. భారతదేశ తత్వవేత్తలు సర్వేపల్లి రాధాకృష్ణ, పి. ఆర్. శంకర్‌ల రచనలు ఈ తత్వాన్నే ప్రతిపాదించాయి. అరవిందుని రచనలు 'విశ్వచైతన్యం' (Cosmic consciousness) transcendental entity అనే భావాలను బలపరుస్తాయి. ప్రముఖ కళాకారులు రచయితలు ఈ 'విశ్వచైతన్యం' నుండి స్ఫూర్తి పొందారని వారి భావన.

విశ్వజనీనత భావాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడం ఈ ఆధునిక యుగంలో ఎంతో అవసరం. మానవ సంబంధాలు, మానవీయ విలువలు మరుగునపడుతున్న ఈ కాలంలో కుల, మత, స్థల, కాలాలకతీతంగా పరస్పర ప్రేమ, అభిమానం పెంపొందించడం వల్ల మెరుగయిన సమాజానికి నాంది పలుకుతుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, వసుధైక కుటుంబ భావనలను బాల్యం నుండి పెంపొందిస్తే 'విశ్వప్రేమకు' 'విశ్వశాంతికి బాటలు వేస్తాయన్నది తధ్యం. అదే నా ప్రగాఢ విశ్వాసం.

‘విశ్వశాంతి' బాటలో మానవసమాజం నడవాలనే ఆకాంక్షతో, ఆదిశ వైపు పాఠకులను ఆలోచింపచేస్తుందనే భావనతో ఈ నా రచన ప్రయత్నం.

- డా. పి. విజయలక్ష్మి పండిట్