• Viswa Katha Sahiti
  • Ebook Hide Help
    ₹ 172.8
    192
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విశ్వకథా సాహితి

    Viswa Katha Sahiti

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పూర్వం నుంచీ మనకు పురాణ గాథలు, పంచతంత్రం, కాశీమజిలీ కథల్లాంటివి ఉన్నా, నాయనమ్మలు చెప్పే జానపద కథలు ఉన్నా, కథానికా ప్రక్రియ మాత్రం నిస్సందేహంగా పాశ్చాత్య సాహిత్య సంపర్కంలో రూపుదిద్దుకున్నదే. లియో టాల్‌స్టాయ్, విలియమ్ సారోయన్, ఆస్కార్ వైల్డ్, సోమర్సెట్ మామ్, మాక్జిమ్ గోర్కీ వంటి ఎందరెందరో మహానుభావుల చేతుల్లో కథానికా ప్రక్రియ ఒక సంపూర్ణతను, ఒక సమగ్రతను సంపాదించుకుంది. పందొమ్మిది, ఇరవై శతాబ్దాలలో వారి వారి దేశ కాల పరిస్థితులను బట్టి ఆ ప్రక్రియకు ఒక రూపాన్నిస్తూ వచ్చారు. The short story is a product of modern age. అడ్గార్ ఎలన్ పో మొదలు అనేకమంది విశ్వ రచయితలు ఈ ప్రక్రియకు వైవిధ్యాన్ని సంతరిస్తూ వచ్చారు.

అన్ని ప్రక్రియలకన్నా కథానిక ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు ప్రజాదరణ పొందింది? అంటే - అది మానవ ప్రకృతికి చాలా దగ్గరగా వుండే ప్రక్రియ కాబట్టి! సామాన్యంగా ఏ కథానిక అయినా ఒక పాత్రపైన లేదా సంఘటన పైన లేదా ఒక భావం మీద ఆధారపడి వుంటుంది. సంక్లిష్టమైన, బహుముఖీనమైన జీవితంలోంచి ఒక ముఖ్య ఘట్టాన్ని కథానిక పాఠకుల ముందు పెడుతుంది. వారి వారి జీవితాల్ని తనలో చూసుకోమంటుంది కూడా! అందులో ఉద్యమాలు, పోరాటాలు, అల్లకల్లోలాలే కాదు, ప్రేమలు, అపార్థాలు, స్వీట్ నథింగ్స్‌తో పాటు కఠినమైన జీవన వాస్తవాలు కూడా వుంటాయి.

ప్రపంచ సాహిత్యం విస్తృతంగా చదువుతూ వున్నా, ఈ కథలే నేనెందుకు అనువదించానూ? అంటే - ఇవి నన్ను కూర్చుండనీయక, నిలబడనీయక, ఊపిరి సలపనీయక సతమతం చేశాయి కాబట్టి! పాఠకుడిగా ఒక గొప్ప అనుభూతిని పొంది, దాన్ని అలాగే నా తెలుగు వారందరికీ అందించాలన్న తాపత్రయంతో తహతహలాడాను కాబట్టి!

- డా. దేవరాజు మహారాజు

Preview download free pdf of this Telugu book is available at Viswa Katha Sahiti