• Vismruta Yatrikudu
  • Ebook Hide Help
    ₹ 302.4
    336
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విస్మృత యాత్రికుడు

    Vismruta Yatrikudu

    Pages: 351
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చరిత్ర విద్యార్థినీ, ద్రిమ్మరినీ కూడా ఐన కారణంగా "విస్మృత యాత్రికుడు" వంటి ఇతిహాస ప్రధానమైన రచన వైపు నా మనసు పోవడం సహజమే. ఇలా చేయడంవల్ల నేను ఒక చరిత్రకారుని, పర్యటకుని బాధ్యతలను మాత్రమే పూర్తిగా నిర్వహించగలిగానని విన్నవించుకుంటున్నాను. అందుకే కేవలం నవలా ప్రేమికులైన పాఠకులకు ఇందులో ఎంతో కొంత లోపాన్ని ఎత్తి చూపడానికి అవకాశం లభించవచ్చు. అటువంటి పాఠకులకు, నాకు దృక్పథాలలోనున్న అంతరం ఇక్కడ గమనార్హమైనది. ఐతే సంభావ్యములైన అటువంటి దోషాల నెన్నిటినో నేనుకూడా అంగీకరించడానికి సిద్ధంగానే యున్నాను. కాని, తొలగించడానికి మాత్రం అశక్తుణ్ణి.

అవి తొలిగించాలంటే వాటితోపాటు కొన్ని సత్యాలనుకూడా తొలగించడం తప్పనిసరవుతుంది. అటువంటి ధైర్యం నాకు లేదు. గత కాలపు సమాజాన్ని వాస్తవిక రూపంలో, నిజాయితీతో చిత్రించడం నా ప్రప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. చరిత్రాత్మక నవలను తత్కాలీన దేశకాల పాత్రములకు, చరిత్రకు, భౌగోళిక సత్యాలకు విరుద్ధమైన అసంగతాలతో నింపడం క్షమార్హం కాని నేరమనే నా దృడాభిప్రాయం. ‘విస్మృతయాత్ర’లోనే నా నియమాన్ని ఎంతవరకు పాటించానో, దానికెంత ప్రాధాన్యత నిచ్చానో సహృదయులైన పాఠకులు ఇట్టే గ్రహించగలరు.

- రాహుల్ సాంకృత్యాయన్

Preview download free pdf of this Telugu book is available at Vismruta Yatrikudu