• Vinuveedhilo Vintalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వినువీధిలో వింతలు

    Vinuveedhilo Vintalu

    Pages: 201
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవజీవితాన్ని మరింత వివేకవంతంగా మలిచేందుకు శాస్త్రవిజ్ఞానం చాలా తోడుపడింది. ఒకప్పుడు ప్రతి దానిలోనూ ‘అద్భుతం’ మాత్రమే చూడగలిగిన మానవుడు, రానురాను, దాని అనుపానాన్ని అవగాహన చేసుకోవడం ప్రారంభించాడు. మెరుపును, ఉరుమును, పిడుగును, నీటిని, నిప్పును, మబ్బును చూసి- ఒకప్పుడు అబ్బురపడిన మానవుడే- నీటి రహస్యాలను తెలుసుకొని, వాటి నుండి ఉపయోగాలు ‘పిండుకోవడం’ ప్రారంభించాడు. ఒకనాటి మానవునికి ‘గాలి’ ఒక దేవుడు. ఈనాడు అదే గాలి, మనిషికి అనేక పనులు చేసిపెడుతున్నది. దీనికి కారణం శాస్త్రవిజ్ఞానం!

నేనైతే శాస్త్రజ్ఞుణ్ని కాదుగానీ, నావంటి సామాన్యుల కోసం, హేమాహేమీల్లాంటివారు రాసిన సుగమవిజ్ఞానశాస్త్ర గ్రంథాలు, అందినవి అందినట్లుగా చదివాను. చదివాక ఇలాంటి పుస్తకాలు తెలుగులో కూడా వుంటే బావుండునని తోచింది. తోచాక, రాయడం ప్రారంభించాను.

‘వినువీధిలో వింతలు’ ముందుగా ‘కృష్ణాపత్రికలో’ ధారావాహికంగా వచ్చింది. 1964లో పుస్తక రూపంగా వెలువడింది. ఆ పుస్తకాన్ని మళ్ళా వేద్దామని అనుకున్నప్పుడు, ఆ పుస్తకాన్ని ఒకసారి సవరించడం మంచిదనిపించింది. 1964కూ, 1982కూ మధ్యన ఖగోళపరిశోధనల్లో అనూహ్యమైన మార్పులు చాలా వచ్చాయి. విశ్వపరిధి విస్తృతమయింది. గ్రహాలను గురించీ, ఉపగ్రహాలను గురించీ, చాలా క్రొత్త విషయాలు బయటపడ్డాయి. దూర దూరాలలోని గ్రహాలకు, వ్యోమనౌకలు ప్రయాణాలు సాగిస్తున్నాయి. కొత్త నక్షత్రమేఘాల ఉనికిని శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు.

అయితే, ఎప్పటికప్పుడు, వచ్చినపడుతున్న ఈ సమాచారాన్నంతా పుస్తకంలోకి చేర్చడం- నాకు సాధ్యంకాదు. అందువల్ల ఒక తేదీని నిర్ణయించుకొని- నా ఆ అందుబాటులో ఉన్న సమాచారాన్నంతా, ఈ పుస్తకంలోకి చేర్చాను. కొన్నిచోట్ల తగ్గించినట్లు, ఇంకొన్నిచోట్ల పూర్తిగా తొలగించినట్లు పాఠకులు సులువుగా కనుక్కోవచ్చు.

ఇందులోనైనా- ఖగోళశాస్త్రం సాధించినవాటి నన్నింటినీ పొందుపరిచానని కాదుగానీ- స్థూలంగానైనా చెప్పడానికి ప్రయత్నించానని మాత్రం మనవిచేస్తున్నాను.

- భరద్వాజ

Preview download free pdf of this Telugu book is available at Vinuveedhilo Vintalu