-
-
వినవోయీ! అల్పజీవి!
Vinavoyi Alpajeevi
Author: Dr. Sunkara Rama Chandra Rao
Language: Telugu
రైక్ (1897-1957) మనో విశ్లేషణా రంగంలో కృషి సల్పిన అగ్రగణ్యులలో ఒకడు. తొలి దశలో ఫ్రాయిడ్ ఆలోచనలతో ఏకీభవించినప్పటికీ, లైంగిక ప్రవృత్తిపై పితృస్వామిక సమాజం విధించిన ఆంక్షలు కలుగ చేస్తున్న మానసిక రుగ్మతలకు పరిష్కారంగా ఉదాత్తీకరణ (sublimation) ను ఫ్రాయిడ్ ప్రతిపాదించడాన్ని వ్యతిరేకించాడు. అలానే లిబిడో సిద్ధాంతాన్ని ఒక భావనగా ఫ్రాయిడ్ పేర్కొనడాన్ని కూడా రైక్ వ్యతిరేకించాడు. లైంగిక అణచివేత మానవ స్వభావాన్ని వికృతపరచిందని, ఈ వక్రీకరించబడిన స్వభావం సాధారణ మానవులలోకి కూడా చొచ్చుకుపోయిందని, వీరి మద్దతు కూడా ఉండడంవల్ల ఫాసిజం సాధ్యమయిందని రైక్ భావన. కమ్యూనిస్టు పార్టీల నియంతృత్వాన్ని కూడా రైక్ విమర్శించాడు. మానవ స్వభావంలో చోటుచేసుకున్న అల్పత్వాన్ని ఎత్తి చూపుతూ రాసిన విమర్శనాత్మక గ్రంథం ఈ వినవోయీ! అల్పజీవి! అన్న రచన. అయితే ఇది నిరాశావహ చిత్రణ కాదు. ఒక మేలుకొలుపు ప్రయత్నం. ఇందులో ప్రస్తావించిన స్వాభావిక అవలక్షణాలు నేటి సమాజంలో కూడా కొనసాగుతున్నందువల్ల, అవగాహనకు, మార్పు దిశగా ఆలోచించేందుకు తోడ్పడుతుందనే అభిప్రాయంతో ఈ పుస్తకం మీముందుంచుతున్నాం. రైక్ ఈ రచనలో ఉపశీర్షికలు వాడలేదు. అయితే, కొన్ని ప్రధాన ప్రస్తావనలను, పాఠకుల సమాచారం కోసం పేర్కొంటున్నాము.
నీ బానిసత్వానికి నువ్వే కారణం
మార్క్స్ చేసిన పొరపాట్లు
నీ మనస్సు చెప్పేది విను
నువ్వంటే నీకున్న భయాన్ని వదిలించుకోవాలి
నా విధి నేను నిర్వహిస్తున్నాను
నీ చరిత్రను చూసి నువ్వే సిగ్గుపడతావు
జర్మన్ మూలం నుంచి ఆంగ్లంలోకి ధియోడార్ పి. ఊల్ఫ్ చేసిన అనువాదాన్ని డా. సుంకర రామచంద్రరావు తెలుగులోకి అనువదించారు.
- ప్రచురణకర్తలు
