• Vijayawada Veedhula Kathalu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయవాడ వీధుల కథలు

    Vijayawada Veedhula Kathalu

    Publisher: Victory Publishers

    Pages: 213
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పేరు లేని ఊరు ఉండదు. విజయవాడకి ఉన్న పేర్లు చూస్తే చాలా చిత్రంగా ఉంటాయి. ఏ ఊరి పేరూ ఊరికే ఆకాశం నుంచి ఊడిపడదు. ప్రతి పేరు వెనుక అపారమైన చరిత్ర ఉంటుంది. అలా ఆ కథలన్నీ మరచి పేర్లు మాత్రమే చూస్తే బిజియివాడు, విజయివాడ, బిజవాడ, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, చోళరాజేంద్రపురం, చోళరాజేంద్ర విజయపురం, మల్లికార్జున మహాదేవపురం, విజయవాడ. ఇన్ని పేర్లు ఉన్నా చరిత్రలో చాలాకాలం బెజవాడగానే చలామణి అయింది.

ఈ నగరం ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, చోళులు, తెలుగుచోడులు, రెడ్డిరాజులు, కాకతీయులు, గజపతులు, దుర్జయులు, నరపతులు, నవాబులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు, త్యాగి వంశీయులు ఇంకా అనేకానేక రాజవంశాల ఏలుబడిలో ఉండేది.

ఈ నగరం హువాన్‌చాంగ్‌, ఫాహియాన్‌, భావదేవర, దిగ్నాగ, మహాపద్మనంద, ఆదిశంకర లాంటి తత్త్వవేత్తలే గాక మహాత్మాగాంధీ లాంటి మహానుభావులు దర్శించిన పుణ్యభూమి.

అనేక యుద్ధాలు జరిగిన రణరంగం. ఒక దశలో కనీసం 50 సంవత్సరాలపాటు నిరంతరం యుద్ధాలలో తల్లడిల్లిన నేల. అన్నింటికి సాక్షీమాత్రంగా కనకదుర్గాదేవి, మల్లేశ్వరస్వామి నిలచిన క్షేత్రం. గత చరిత్రకు చిహ్నాలుగా దుర్గగుడి, మల్లేశ్వరాలయం, కుమారస్వామి గుడి, మొగల్‌రాజపురం, భవానీపురం, విద్యాధరపురం, నున్న, మాచవరం, రామవరప్పాడు.... ఇలా ఏ ప్రాంతాన్ని చూసినా అంతులేని వింతవింతైన రసరమ్య చరితులు పరివేషంగా గల నగరం విజయవాడ.

ప్రతి కట్టడం వెనుక అద్భుతమైన కథ ఉంది. చరిత్ర ఉంది. చరిత్ర పురుషుల హస్త స్పర్శ ఉంది. పుణ్యపురుషుల దర్శన ముద్ర ఉన్నది. మనం దర్శించే పాత శివాలయం, మనం తిరుగుతున్న వీధులు..... ఇలా ఒకటేమిటి అన్నీ మహాపురుషుల పాదస్పర్శతో పులకించి, పునీతమైనవి, వారి అడుగుజాడల్లో కాకపోయినా ఆ వీధుల్లో నేడు మనం తిరుగుతున్నాం. ప్రతి వీధిలోను ప్రాతస్మరణీయులైన మహాపురుషులు జీవించారు.

కొంత చరిత్ర పరిశోధన వల్ల తెలిసేది అయితే కొంత మరపు తలపులలో మరుగున పడిపోతున్నది. అలాంటి చరిత్రను తెలుసుకోవడం అంటే గతం నుంచి నిర్మాణాత్మకమైన స్ఫూర్తి పొందడమే అవుతుంది. తెలుసుకోవడం ప్రగతికి మంచి బాట అవుతుంది. సాధ్యమైనంత వరకు నగర చారిత్రక స్వరూపం చిత్రీకరించాలని ప్రయత్నించాను. ఇది కొండను చేతితో పట్టుకోవటం లాంటి పని. వీధులకు పరిమితమై, ఆ వీథికి సంబంధించిన ఆసక్తికరమైన చారిత్రక విశేషాలు ఉటంకించాను - సమగ్రంగా కాకపోయినా! చరిత్రను సంపన్నం చేసేది వ్యక్తుల చరిత్రలు. ఆ చరిత్రలు వ్రాయటమంటే అదొక మహా ప్రవాహం. గ్రంథ విస్తరణ భీతితో ఆ అంశాలు స్పృశించలేదు.

ఈ తరహా రచనలలో నాకు తెలిసినంత వరకు ఇదే ప్రథమ ప్రయత్నమని నా నమ్మకం.

- లంక వెంకట రమణ

Preview download free pdf of this Telugu book is available at Vijayawada Veedhula Kathalu
Comment(s) ...

ఇది సంపూర్ణ పుస్తకమా?
ఇదివరకూ రెండు భాగాలలో చూసాను!