• Vidyarthulu Viluvalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • విద్యార్థులు - విలువలు (free)

    Vidyarthulu Viluvalu - free

    Author:

    Pages: 124
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేను 1963వ సంవత్సరమునుండి 1969వ సంవత్సరం మార్చి వరకు ఉన్నత పాఠశాల విద్యార్థిగా విద్యనభ్యసించాను. ఆనాటి పాఠశాల విద్యార్థులకు, నేటి పాఠశాల విద్యార్థులకు హస్తిమస్తిష్కమంత తేడా ఉన్నది. ఆనాటి విద్యార్థులకంటె నేటి విద్యార్థులకు తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. కానీ పరిశ్రమ (హార్డ్‌వర్క్), నిజాయితి, విలువలు తక్కువగా ఉన్నాయని చెప్పాలి. నేటి విద్యార్థులకున్న పాఠశాల వసతులుగాని, టెక్నాలజీగాని ఆ రోజుల్లో లేవు.

ఉన్నత పాఠశాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వ్రాసిన పుస్తకం ఇది. వారికిది నేర్చుకునే దశ. నేటి పాఠశాల విద్యావిధానములో ప్రధాన అంశము ప్రభుత్వానికి, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు, చివరకు విద్యార్థులకు మార్కులు, ర్యాంకులే. ఈ మార్కులు - ర్యాంకుల సాధనలో సిలబస్ పూర్తి చేయటం, చదివించటం, పరీక్షలు నిర్వహించటం, పేపర్లు దిద్దటంలో అధ్యాపకులు తీరిక లేకుండా ఉంటారు. కొందరికి సమయం కూడా చాలకపోవచ్చు. సమయాభావం వలన విద్యార్థులకు ఇతర విషయాలు, సంబంధిత విషయాలు చెప్పే అవకాశం దొరకదు. చదువుతోపాటు కొన్ని సంబంధిత విషయాల్లో, విలువలు విషయాల్లో, వాటిని నేర్చుకొని పాటించే విషయాల్లో విద్యార్థులు వెనుకంజలో ఉన్నారనే చెప్పక తప్పదు. నేను పాఠశాల విద్యార్థులను దాదాపు దశాబ్ద కాలంనుండి గమనిస్తున్నాను. విద్యార్థుల్లో కొంతమందైనా విలువలుతో కూడిన అంశాలను చదవాలని, నేర్చుకోవాలని, అధ్యాపకులు వారికి బోధించాలని నా ఆరాటం, తపన. ఆ ఉద్దేశంతోనే నేను వృత్తిరీత్యా ఆంగ్లోపన్యాసకుడినైనా వ్యవహారిక, గ్రాంధిక తెలుగు భాషలో 22 అంశాలతో కూడిన పుస్తకాన్ని వ్రాశాను.

- గాలి సుబ్బారావు