• Vidyarthi Kalpalatha
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విద్యార్థి కల్పలత

    Vidyarthi Kalpalatha

    Publisher: Victory Publishers

    Pages: 418
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శాస్త్రములు అనంతము. తెలుసుకోవలసినది మహాసముద్రమంత అని సూక్తి. శాస్త్రాలనుకాని, విద్యలను కానీ గ్రంథాల ద్వారా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా భాషను నేర్చి, చక్కని రచనాశైలిని అలవరుచుకోడానికి, నిఘంటువులు, వ్యాకరణములు మొదలైనవి అవసరం. ఒక పదానికి అర్థాన్ని తెలిపేవి ఒక రకం నిఘంటువులైతే, తెలుగు భాషలో నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, రూపాంతరాలు, ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు వంటి అనేక విషయాలపై అవగాహన కలిగించేవి ఇంకొక రకమైన నిఘంటువులు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి వీటి అన్నింటినీ పబ్లిక్ పరీక్షాపత్రాలలో ప్రశ్నలుగా అడుగుతున్నారు.

ఆరు ఏడు దశాబ్దాల క్రిందట కీ. శే. ముసునూరి వేంకటశాస్త్రిగారు ఈ సమాచారమంతా సమకూరుస్తూ, "విద్యార్థి కల్పతరువు" అనే రెండు భాగాల పుస్తకాన్ని సంకలనం చేసారు. అయితే నేడు అది అలభ్యం. పైగా అంత పెద్ద గ్రంథాలు విద్యార్థులకు అందుబాటులో ఉండడం కూడా కష్టమే. అందుకే విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని "విద్యార్థి కల్పలత" అనే ఈ చిన్న పుస్తకం సంకలనం చేయబడింది.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఇవ్వబడే అంశాలన్నీ ఇందులో సమకూర్చబడ్డాయి. ఇది కేవలం విద్యార్థులకే కాకుండా, తెలుగు బోధించే అధ్యాపకులకు కూడా కరదీపికగా పనికి వస్తుంది.

- ఆవంచ సత్యనారాయణ

Preview download free pdf of this Telugu book is available at Vidyarthi Kalpalatha