-
-
విద్వేషాన్ని రెచ్చగొట్టవద్దు!! ఫ్రజల్ని చీల్చవద్దు!!
Vidweshanni Rechchagottavaddu Prajalni Cheelchavaddu
Author: Ramana Murthy
Publisher: Janaharsha Publishers Pvt. Ltd.
Pages: 26Language: Telugu
విద్వేషాన్ని రెచ్చగొట్టవద్దు!! ఫ్రజల్ని చీల్చవద్దు!!
2009 డిసెంబర్ 27,28,29 మరియు 2010 జనవరి2 నాటి 'జైభారత్ రాష్ట్ర కమిటీ' సమావేశాల్లో ఆమోదించిన విఙ్ఞప్తి తీర్మాన పత్రం ఇది.
ఈరోజు తెలుగు నేల నిట్టనిలువునా చీలి వుంది. మనిషికీ, మనిషికీ మధ్య మైళ్ల దూరం ఏర్పడింది. తెలుగువాడు తెలుగువాడినే నమ్మలేకున్నాడు. అపోహలతో, అసహనంతో, ఆగ్రహంతో.. తెలుగు ప్రజ అతలాకుతలమవుతోంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని లేదా రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలనే నినాదాలతో సాగుతున్న ఉద్యమాలు ఇవ్వాళ తెలుగు ప్రాంతాల్లో లక్షలాది, కోట్లాది జనబాహుళ్యాన్ని కదిలిస్తున్నాయ్. రెండు నినాదాల్లోని మంచి చెడ్డల్ని ఇక్కడ సమీక్షించం మా లక్ష్యం కాదు, కానీ ...ఇవ్వాళ ఉద్యమాల పేరిట ప్రస్ఫుటంగా ముందుకు వస్తున్నకొన్ని అప్రజస్వామిక, విద్వేష, అసంగత ధోరణుల్ని మేం ఖండిస్తున్నాం.
రాష్ట్రాన్ని విభజించడం, లేదా సమైక్యంగా వుంచడం వలన వచ్చే లాభం కంటే... ప్రజల్ని నిట్టనిలువుగా చీల్చి, ఒక సెక్షన్ ప్రజల్ని మరొక సెక్షన్ ప్రజలకు వ్యతిరేకంగా నిలబెట్టే విద్వేష, అసహన విధానాల వలన కలిగే దుష్ప్రభావం అపరిమితం అని మేం భావిస్తున్నాం. రానున్న దశాబ్దాల కాలం తెలుగు ప్రజల మనసుల్లో ఈ విద్వేష విషం ప్రభావం నిలిచిపోతుందని, తీరని నష్టాన్ని కలిగిస్తుందని మేం ఆందోళన పడుతున్నాం. ప్రజల గురించి.. దేశ ప్రజల నిజమైన వికాసాన్ని గురించి.. తపించి, ఉద్యమించే బాధ్యతాయుతమైన ఉద్యమ సంస్థగా మేము, ఈ విషమ పరిస్థితిలో... ఉద్యమాలను కరుణ, ప్రజాస్వామికతల పునాదుల పైనే, నిర్మించవలసిన, నిలుపవలసిన అవసరాన్ని సదా గుర్తెరిగి ప్రవర్తిద్దామని... ఉద్యమ కారులందరికీ విఙ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలకు, ప్రజాతంత్ర వాదులకూ విఙ్ఞప్తి చేస్తున్నాం.
* * *
''....మానవ చరిత్రలో మరో సమస్య విద్వేషం నుండి హింస పెరగడం. అసలు విద్వేషమే పూర్తిగా అహేతుకం. కానీ ఈ పద్ధతిలో అన్యాయాల్ని తుడిచిపెట్టవచ్చనే విశ్వాసంతో కొన్ని సందర్భాలలో హింసాత్మకమైన పదాలు, కార్యాచరణలు వినియోగించారు. వ్యవస్థను నిర్వహించే వ్యక్తుల మీద వుండే ద్వేషం వేరు. అన్యాయమైన వ్యవస్థపై వుండే ఆగ్రహం వేరు. వ్యక్తుల్ని నాశనం చేసినంత మాత్రాన వ్యవస్థ నాశనం కాదు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఆగ్రహం అవసరమే. కానీ ఆ ఆగ్రహం ద్వేషంగా మారకూడదు. లోహియా చెప్పినట్లు ఒక కంట్లో ఆగ్రహజ్వాల వుంటే, మరో కంట్లో కరుణతో కూడిన కన్నీరు వుండాలి...''
- శ్రీ కేశవరావు జాదవ్, సోషలిస్టు మేధావి, తెలంగాణా ఉద్యమ నాయకులు

- ₹75.6
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹108