• Vidhini Ediristunna Veedhi Baalalu Peda Pillalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు, పేద పిల్లలు

    Vidhini Ediristunna Veedhi Baalalu Peda Pillalu

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీమతి గురజాడ శోభా పేరిందేవి సేవ చేయడమే కాదు, వృద్ధుల గురించిన గ్రంథాలు, ముఖ్యంగా కథలు, వృద్ధుల జీవిత విశేషాలతో కూడిన గ్రంథాలు రచించారు. బాలలకు, ముఖ్యంగా వీధిబాలలకు స్ఫూర్తిగా ఉండడం కోసం ఇప్పుడు కొన్ని నాటికలను రచించి ప్రచురిస్తున్నారు. ఈ గ్రంథం అనాథ బాలలకే కాదు, పిల్లల తల్లిదండ్రులందరికీ స్ఫూర్తిని కలిగించేదిగా ఉంది.

ఈ గ్రంథంలో తొమ్మిది నాటికలున్నాయి. ‘జననీ జన్మభూమిశ్చ’ అనే నాటికలో తమ పిల్లలపై తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను బలవంతంగా ఎలా రుద్దుతున్నారో చిత్రించారు. సంవత్సరంలో జరుపుకునే ఉత్సవాలను, ముఖ్యంగా ప్రపంచ శాంతి దినోత్సవం మొదలుకొని, మాతృభాష, మహిళ ఆరోగ్య, పోయెట్రీ, కర్షక, బాలల, వికలాంగుల దినోత్సవాల గురించిన అవగాహన కలిగిస్తూ, ‘క్రిస్మస్’ తో ముగించడం ‘హ్యాపీడేస్‌’లో కనిపిస్తుంది.

జంతువులతో ప్రయోగాత్మకంగా రచించిన ‘అడవిలో అందాలపోటీ’ అనే నాటికలో ఎందుకూ పనికిరాని వారు సమాజంలో ఉండరని కాకి పాత్ర ద్వారా ఉద్బోధించారు. కాలుష్యాన్ని నింపుతూ పంచభూతాల్ని మలినం చేస్తున్న మానవులకు చక్కని సందేశమిచ్చిన నాటిక ‘రక్షించండి’. ఎలెక్ట్రానిక్ పరికరాలను ఎలా ఉపయోగించాలో బోధించే నాటిక ‘మా పాట్లు వినేదెవరండీ!’. అనాథలకు తోడ్పాటుగా ధనికుల పిల్లలు బర్త్‌డేలు జరుపుకోవాలని పిల్లలకు బోధ కలిగించే నాటిక ‘జన్మదిన కానుక’.

అనేక సూక్తులతో మానవతా విలువలతో కూడిన వాక్యాలు పొందుపరిచిన శీర్షికలూ దీనిలో చేర్చారు.
ఇది స్ఫూర్తిదాయక గ్రంథం.

డా. బి. జయరాములు

ఇంచార్జ్ డీన్, ఓరియంటల్ ఫాకల్టీ,

ఉస్మానియా విశ్వవిద్యాలయం.

Preview download free pdf of this Telugu book is available at Vidhini Ediristunna Veedhi Baalalu Peda Pillalu