• Vidanimudi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విడనిముడి

    Vidanimudi

    Publisher: Palapitta Books

    Pages: 126
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ముకుంద రామారావుగారి యీ 'విడనిముడి' ఆత్మీయ అనుభవాల సంపుటి. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, వృద్ధ పితరులు, సొంత ఇల్లు, మనుమలు, దూరమైన మిత్రులు - జీవితంలోకి వచ్చేపోయే అనేక సందడులూ, తాత్త్విక క్షణాలు, గతానికీ వర్తమానానికీ భవిష్యత్తుకీ నడుమ ప్రాణలోలక చలనాలు, - ఈ కవితలకు ప్రేరణలు.


జీవితాన్ని ప్రేమించి - వంశధారను స్మరిస్తూ, - తన తరానికి ముందూ వెనకా స్మృతులను సవరించుకుంటూ,- ఒక్కొక్క క్షణికానుభవాన్నీ, నలిగిపోనివ్వకుండా అల్లిన - యీ దండలో ముడులు - వీడనివే. ఈ అనుభవ పరంపరలు, మీకు నాకు మరెవరికో కూడా తాకేవే. కానైతే చిన్న చిన్న తేడాలు. అంతే.


ముకుంద రామారావుగారు నేడు చాలామంది వ్రాస్తున్న కవిత్వ మార్గంలోని వారు కారు. అది ఆయన అదృష్టం. ఈ జీవితాన్ని - ముఖ్యంగా తన కుటుంబ జీవితాన్ని - ప్రేమించిన సున్నితమైన వ్యక్తి. ఆయనకు నా అభినందనలు.

- ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

* * *


తీరాలు సముద్రాలు దాటొచ్చిన రక్తాన్ని
ప్రాంతాలు నదులు దాటిన శరీరాన్ని
రంగు మార్చని పూవుని
భాష రాని పాటని
పక్షుల ఆకాశ భాషని
నవ్వుతూ ఏడుస్తూ సాగిపోతున్న మేఘాన్ని
చేతులు చాచి ఆహ్వానిస్తున్న ఆకాశాన్ని
నచ్చిన సుగంధాన్ని పంచుతున్న గాలిని
కాంతిలో కళ్లు నింపుకుంటున్న దీపాన్ని
మార్గదర్శకుల నీడని
ఆకులకన్నీరు కారుస్తున్న చెట్టుని
రాస్తూ చెరిపేస్తున్న వర్షాన్ని
సముద్రం తల్లీ తండ్రికి చేరువవుతున్న నదిని

Preview download free pdf of this Telugu book is available at Vidanimudi