• Veturism
  • Ebook Hide Help
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేటూరిజం

    Veturism

    Pages: 180
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సినీ వినీలాకాశంలో ఒక ధృవతారగా వెలుగొందిన కవి శ్రీ వేటూరి సుందరరామమూర్తిగారు. పండిత కుటుంబంలో జన్మించిన ఆయన పాత్రికేయులుగా, కవిగా, కథా రచయితగా, పాటల రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎంతో విఖ్యాతి పొందారు. తాను స్పృశించిన ప్రతి అంశాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. గుడిసెల్లో నివసించే సుగాలీ కన్యల జీవన సౌందర్యం నుంచి సినీమా పాటల్లో అందమైన ప్రకృతి వర్ణనలు దాకా ప్రతి రచనలో తనదైన అలంకార శైలిని ప్రస్పుటింపజేశారు. సినీ పాటల తోటలో వికసించిన పద్మం శ్రీ వేటూరి గారు.

అలాంటి వేటూరి సుందర రామమూర్తి గారి పాటల సాహిత్యాన్ని ఒక పరిశోధన అంశంగా ఎంచుకొని, సునిశితంగా ప్రతి అంశాన్ని తాకి, డాక్టరేట్ అవార్డు పొందారు జయంతి చక్రవర్తి గారు. ప్రస్తుతం వేటూరి గారి జీవిత విశేషాల్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, వారి పాటల శైలిని, ఆయన స్వయంగా వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని ఒక పుస్తకం(మోనోగ్రాఫ్)గా మలచి సినీ సంగీత, సాహిత్య అభిమానులకు అందిస్తున్నారు. వీరి ప్రయత్నం అత్యంత అభినందనీయం.

వేటూరి వారితో ముఖాముఖి మాట్లాడి, వారి విలువైన జ్ఞాపకాలను పదిలపరచి, గ్రంథస్థం చేయడంలో కృతకృత్యుడైనారు శ్రీ జయంతి చక్రవర్తిగారు. గురుతుల్యునికి ఒక శిష్యుడు ఇచ్చిన నివాళికి ప్రతిరూపమే ఈ “వేటూరిజం” గ్రంథం. అభినందనలతో...

- డా. డి. విజయ్ భాస్కర్

***


ఉ. ఎందరు లేరు మిత్రులు మరెందరు లేరట సాహితీ ప్రతుల్
చందురు వంటి చల్లనయు సాహితి సౌహితి గుత్తగొన్న వా
రెందరు అందరం దిగిచి ఈ కవి డెందము హత్తుకొన్న మా
సుందరరామమూర్తికి వసుంధరలో నుపమానమున్నదే?

- దాశరథి


ఉ. పాటల కూర్పులా చతుర భావనలారసరమ్య రీతులా
మాటల నేర్పులా మధుర మార్గములా బహుచిత్ర గీతుల
నాటురసోక్తులా భళియనవ్వలె నన్నిట తానె యన్నిటన్
మేటియు గీర్తికాంతుడు సినీకవి వేటూరి సాటిరారారుల్

- డా.వేటూరి ఆనందమూర్తి


సీ. సంగీత సాహిత్యసార ముగ్గరు గడ్డ .... పెద్దకళ్లేపల్లి ముద్దుబిడ్డ
వేదనాదానూన 'వేటూరి' వృక్షాన .... చేవపట్టినయట్టి చివురుకొమ్మ
పాత్రికేయత ప్రజాస్పందన కనిపెట్టి .... పలుకులల్లెడు నట్టి చిలుకు కొండ
వ్రాసిన పాటెల్ల రాలని పువ్వైన .... జాతీయవనపారిజాతనగము
అభినుతించెనాచార్య నాగార్జునుండు
జీవనది కృష్ణతో చిరంజీవియైన
తేటతెనుగుగూట 'వేటూరి పాట' నవని
తెలుగులునల్నంత దాక తా నిలుచుగాక!

- డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Veturism