• Vennela Bomma
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెన్నెల బొమ్మ

    Vennela Bomma

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చాలా కాలం తరువాత ఐరన్ సేఫ్ తెరిచింది శృతి. అందులో భద్రంగా దాచిన ఒక పాతపెట్టె తీసింది. అది బాగా తుప్పుపట్టింది. అది తెరిచిచూస్తే అందులో ఒక పాతబడ్డ ఓణీ... లంగా... చినుగుల జాకేట్టూ అసహ్యంగా మాసివున్నాయ్.
అవి పది సంవత్సరాల వెనకవి. అవెందుకున్నాయ్ శృతి ఇంట్లో?
ఆమె ఎందుకంత భద్రంగా దాచింది?
వాటికీ ఆమెకీ గల అనుబంధం ఏమిటి?
ఏమో... ఏదీలేకుండా ఏదీ చెయ్యరు ఎవరూ.
వాటిని మళ్ళీ ఆ పాత పెట్టెలో పెట్టి ఐరన్ సేఫ్‌లో దాచేసింది.
ఆమె హృదయం మూల్గుతుంది బాధగా, ఈ క్షణంలో ఆమె “ఊఁ” అంటే ఆమెని పెళ్ళి చేసుకోవడానికి 16 వేలకి పైన సిద్దంగా ఉన్నారు మగాళ్ళు. ప్రతీదినం ఆమెకొచ్చే లేఖలన్నీ ఇలాంటి వాళ్ళనుండే. అందులో కొందరు కవిత్వపు పైత్యం ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళ సుదీర్ఘ లేఖలకి అంతం ఒక ఇరవై పేజీలకి. వాళ్ళ లేఖల్లో...
నువ్వు హిమగిరి కొండల్లోంచి ఉద్భవించిన హిమకన్యవి... రామప్ప ఆలయంలో ప్రాణంపోసుకున్న నగ్నకన్యవి... కవిలో చీకట్లో సైతం దరహాసాలు చిందించే నిశాకన్యవి...
ఇండియాలో పుట్టిన కాళిదాసూ... సముద్రాల అవతలి షేక్‌స్పియరూ నిన్నే ఊహించి చనిపోయారు. అసదుల్లాఖాన్ గాలిబ్ కూడా.
ఈ వర్ణనలూ ప్రశంసలూ ఆమెని పరవశం చెయ్యకపోగా ఓ రకమైన ఎలర్జీకి గురిచేసి అడకత్తెరలో నొక్కిపారేస్తాయ్.
అందుకే ఆమె ఎప్పుడూ వాటిని చదవదు.
గతం, వర్తమానం ఈ రెండింటిలోనూ కూడా శాంతిలేదు శృతికి. అశాంతితో కొట్టుకుపోతుంది. బ్రతకడం వృత్తిగా పెట్టుకు బ్రతుకుతోంది. తన బాబు దొరికేవరకూ గతాన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. రహస్యమైన గతాన్ని పదేపదే స్మరిస్తూనే ఉంటుంది.

Preview download free pdf of this Telugu book is available at Vennela Bomma