• Vemanna Vedam
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేమన్న వేదం

    Vemanna Vedam

    Author:

    Publisher: Yuva Bharathi

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేమన్నవేదం అందరి వేదం. సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్నవేదం. ఆధునిక వేదం. తెలుగువేదం. వేమన్న తనకు తాను చెప్పుకున్న వేదం. అందరు తెలుసుకోవలసిన వేదం. కార్యాచరణకు మార్గనిర్దేశనం చేసిన వేదం. సమాజశ్రేయస్సు కోరిన వేదం.

లోకంలోని నిత్యసత్యాలను పద్యాలరూపంలో ప్రకటించినవాడు వేమన. వర్ణవ్యవస్థను వ్యతిరేకించినవాడు వేమన. మూఢనమ్మకాలను నిరసించినవాడు వేమన. దురాచారాలను ఖండించినవాడు వేమన. నిజమైన జీవితతత్త్వాన్ని తెలిపినవాడు వేమన. ఆధునిక గృహస్థ ధర్మాలను తెలిపినవాడు వేమన. జీవిత పరమార్థాన్ని తెలియజేసినవాడు వేమన. వ్యక్తిత్వ వికాస మర్మాలను విదితం చేసినవాడు వేమన. ఆర్థిక వ్యవస్థలోని మూలసూత్రాలపై ఆకళింపు కలుగజేసినవాడు వేమన. ఉన్నతులను, అల్పులను సమీక్షించినవాడు వేమన. నీతిని బోధించినవాడు వేమన. సద్గుణాలను వ్యక్తపరచినవాడు వేమన. మానవత్వాన్ని మేలుకొలిపిన వాడు వేమన. ఐకమత్యాన్ని ప్రబోధించినవాడు వేమన. అందుకే వేమన పద్యం రాని తెలుగువాడు ఉండడు. అందుకే ప్రపంచంలోని చాలా భాషల్లోకి అనువదింపబడ్డాయి వేమనపద్యాలు. ఉత్తమ సమాజ నిర్మాణానికి తన అనుయాయులకు విధించిన ఏడు సూత్రాలను, కొమర్రాజు లక్ష్మణరావు గారి అముద్రిత వ్యాసంలోనివి, రాళ్లపల్లి వారు 'వేమన'లో పేర్కొనగా వానిని ప్రత్యేకంగా ఉట్టంకించినారు ఆరుద్ర గారు ఈ పుస్తకంలో. తెలుగునాట జాతీయాలుగా, నానుడులుగా పరిణమించాయి వేమన పద్యాలు.

ఆ పద్యాలకు రసార్ద్రతను చేకూర్చినాయి ఆరుద్రగారి వ్యాఖ్యానాలు.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Vemanna Vedam