• Veelunama - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వీలునామా (free)

    Veelunama - free

    Author:

    Pages: 320
    Language: Telugu
    Rating
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    '4.40/5' From 10 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్కాట్లాండ్ లోని ఒక పల్లె దగ్గర వుండే ఒక పెద్ద భవంతిలో, ఆ వేసవి రోజు ఒక రకమైన దిగులు అలుముకోని వుంది. ఆ భవంతి సొంత దా రూ క్రాస్ హాల్ ఎస్టేటు యజమానీ అయిన హొగార్త్ గారు జబ్బు చేసి మరణించి అప్పటికి రెండు రోజులైంది. ఆ రోజు ఉదయమే ఆయన అంత్య క్రియలు ముగిసాయి.

స్త్రీలంటే వుండే అపారమైన గౌరవం చేత ఆయన వివాహం చేసుకోలేదని ఉరివాళ్ళనుకుంటారు. భార్యా బిడ్డలూ లేకపోయినా, ఆయనతో పాటు పదిహేనేళ్ళుగా నివసిస్తూన్న మేనకోడళ్ళు జేన్, ఎల్సీ లిద్దరూ వున్నారు. ఒక్కగానొక్క చెల్లెలు పదిహేనేళ్ళ క్రితం చనిపోతే వాళ్ళిద్దర్నీ ఆయన చేరదిసి ఇంటివద్దనే చదువు చెప్పించారు. ఆయన కున్న ఇద్దరు అన్నలూ సంతానంలేకుండానే మరణించారు. అందువల్ల ఆయన ఆస్తి పాస్తులన్నీ ఇప్పుడా ఇద్దరు అమ్మాయిలకే చెందొచ్చని అందరి ఊహ. ఆయనకింకెవరూ బంధువులు వున్నట్టు లేరు. ఆ భవంతిలో వేరే బంధువులెప్పుడూ కనపడలేదు.

ఊళ్ళో అంతా ఆయన గురించి కొంచెం వింతగా చెప్పుకుంటారు. ఏ క్షణంలో ఆయన మనసెలా వుంటుందో, ఎప్పుడే విచిత్రమైన పని చేస్తారో ఎవరికీ అంతుబట్టదు. ఇప్పుడీ మేనకోడళ్ళ సంగతే తీసుకుంటే, అందరు అమ్మాయిలకు చెప్పించినట్టు సంగీతమూ, చిత్ర లేఖనమూ లాటి నాజూకు విద్యలు కాకుండా కొంచెం విభిన్నమైన చదువులు చెప్పించారని వినికిడి.

అంత్య క్రియలు ముగిసి అందరూ ఆ భవంతిలోని హాలులోకి చేరుకుంటున్నారు. హొగార్త్ మేనకోడళ్ళిద్దరూ, ఆయన వకీలు మెక్-ఫార్లేన్ గారూ,ఆయన వైద్యుడు బైర్డ్ గారూ వున్నారు హాలులో. వీళ్ళతోపాటు ఒక అపరిచిత వ్యక్తిని చూసి ఆశ్చర్యపడ్డారు, జేన్, ఎల్సీ. దాదాపు ముఫ్ఫై యేళ్ళ వయసున్న ఆ పొడుగాటి వ్యక్తిని వాళ్ళింతకు ముందెప్పుడూ చూడలేదు. చాలా గంభీరంగా వున్నాడెందుకనో. వకీలు గారూ, డాక్టరు గారూ కొంచెం ఇబ్బందిగా, చిరాగ్గా వున్నారు. వీలునామా చదివే ముందు అవసరమైన చిన్న చిన్న పనుల వల్ల అయి వుండొచ్చు. ఏవేవో కాగితాలు చూస్తూ కొంచెం కాలయాపన చేస్తున్నారు.

ఆఖరికి అందరూ కూర్చున్నాక వీలునామా చదవడం మొదలైంది. ఎందుకనో వకీలు గారికి గొంతు పట్టేసినట్టుంది.