-
-
వెదురు వంతెన
Veduru Vantena
Author: Kolluri Soma Sankar
Publisher: Self Published on Kinige
Pages: 124Language: Telugu
ఈ కథలు చదివిస్తాయి. ఆలోచింపజేస్తాయి. వెంటాడుతాయి. కోపాన్ని తెప్పిస్తాయి. కంటతడి పెట్టిస్తాయి. కొన్ని కథలు నివ్వెరపోయేలా చేస్తాయి. పుస్తకం తెరిచి ఈ అనువాద కథలను మీరు చదవటం ప్రారంభించిన వెంటనే అందులో మీరు లీనమవుతారు. అందుకు కారణం కొల్లూరి సోమ శంకర్ ఎన్నుకున్న కథలు, అందుకు ఆయన అనుసరించిన శైలి.
ఇక అనువాదాల విషయానికి వస్తే ఈ అనువాదాలన్నీ సరళంగా, సాఫీగా, క్లుప్తంగా, సొంత కథల్లా తెలుగుతనంతో కూడుకుని పాఠకుడిని వెంటనే ఆకట్టుకుంటాయనటంలో సందేహం లేదు.
ఈ సంకలనంలోని ప్రతీ కథా ఏదో ఒక ప్రత్యేకత కలిగినటువంటిది. వైవిధ్యభరితమైన ఈ కథల్ని చదవటం ఒక అనుభవం. చదివిన వెంటనే మొదట్లో సాధారణంగా ప్రారంభమైన కథలు చివరికి వచ్చేసరికి తల దిమ్మతిరిగేలా చేస్తాయి.
ఈ సంకలనం గుండెల్ని తడుతుంది. ఈ కథలు ఎవరికి వారు చదివి అనుభూతి చెందవలసిందే.
- రంగనాథ రామచంద్రరావు
రచయిత, అనువాదకుడు
“వెదురు వంతెన”పై ప్రముఖ రచయిత, వైద్యులు డా. చిత్తర్వు మధు గారు వ్రాసిన సమీక్ష పుస్తకం.నెట్లో ప్రచురితమైంది. ఈ లింక్లో సమీక్ష చదవగలరు. http://pustakam.net/?p=17342
కొల్లూరి సోమ శంకర్