-
-
"వేదవేద్య" శ్రీ వినాయక సహస్రనామావళి
Vedavedya Sri Vinayaka Sahasranamavali
Author: Kunapuli Venkatachalapati Sarma
Publisher: Shri Veda Bharathi
Pages: 60Language: Telugu
మన సనాతన ధర్మంలో గణపతికి ఉన్నస్థానం అద్వితీయమైనది. దీనికి ఆధార వచనము - "ఆదౌ పూజ్యో గణాధిపః". ఏ పని అయినా, ఏ పూజ అయినా ప్రారంభించేముందు నిర్విఘ్నంగా జరగాలని మొట్టమొదట మనం చేసేది గణపతి పూజ. ఇది మనకు అందరికీ తెలిసిందే. చివరకు వినాయకచవితి నాడు మనం చేసే సిద్ధివినాయకపూజకు కూడా ముందుగా పసుపుగణపతిని పూజించడం మన సంప్రదాయం. అంటే మిగిలిన దేవతలందరూ సగుణ బ్రహ్మను సూచిస్తే, గణపతి మాత్రం "సత్యం శివం సుందరం" అని వర్ణించబడే గుణాలకు అతీతమయిన, గుణాలకు ఆధారమయిన నిర్గుణ బ్రహ్మను సూచిస్తుంది.
గణపతి అని అనినవెంటనే స్ఫురణకు వచ్చే మంత్రం - "గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వ న్నూతిభి స్సీద సాదనమ్". ఆ మంత్రానికి భావము - "ఓ సర్వమంత్రాలకు అధిపతీ! నీవు రాజులకు రాజువి, సర్వగణములకు అధిపతివి, కవులకు కవివి, ఆదర్శంగా పోల్చదగిన వారందరిలో అత్యంత శ్రేష్ఠుడవు. అట్టి నిన్ను ఆహ్వానిస్తున్నాము. మేము చేయబోవు ఈ పనియందు మమ్మలను పరిపాలించుటకు అవసరమయిన సర్వసాధన సంపత్తితోను నీవు ప్రవేశించి మమ్మ రక్షింపుము!"
ఇట్టి నిత్యసత్యస్వరూపుడయిన పరమాత్మను వర్ణించేవి వేదమంత్రాలలోని శబ్దాలు (పదములు). ఈ పదములు వేదంలో అనేకం ఉన్నాయి, అనేక ప్రకరణాలలో ఉన్నాయి. ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క విశిష్టలక్షణాన్ని బోధిస్తుంది. అందుచేతనే పరమాత్మను "వేదవేద్యుడు" అంటారు. పరమాత్మ అనుగ్రహం పొందడానికి వేదపారాయణ చక్కని సాధనం. వేదమంత్రాల వినియోగంతో నిర్వహించబడే అశ్వమేధాది సర్వశ్రేష్ఠ యజ్ఞాల ఫలితాన్ని వేదపారాయణద్వారా పొందవచ్చని పెద్దలు అంటారు. అది వేదశబ్దము యొక్క ఘనతను సూచిస్తుంది.
అతి కరోరమైన వేదవిద్య అందరికి సాధ్యంకాదు. వేదపారాయణ కూడా ఇంటింటా నిత్యం సాధ్యంకాదు. అందుకే వేదవేద్యుడయిన పరమాత్మను సులభమైన ప్రముఖమైన వేదశబ్దాలతో ఏడాదికొక్కసారైనా మనసారా అర్చన చేసుకొని అందరూ తరించాలనే ఆశతో, ఆశయంతో శ్రీవేదభారతి చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం - "వేదవేద్య శ్రీ వినాయక సహస్రనామావళి" సంకలనం. దీనితోబాటు "వేదవేద్య అష్ణోత్తర శతనామావళి" కూడా అందించబడింది. ప్రాచీన గ్రంథాలలో లభిస్తున్న అప్లోత్తరశతనామావళిని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది.
- డా. రేమెళ్ల అవధానులు

- ₹120
- ₹450
- ₹480
- ₹72
- ₹300
- ₹810