• Veda Saram
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేద సారం

    Veda Saram

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 124
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


నాలుగు వేదాల నుండి ఎంపిక చేయబడిన నూరేసి మంత్రాలకు అర్థాలు వివరిస్తున్నారు డా. వైఎన్నార్. మొత్తం నాలుగు వందల మంత్రాలు - వాటికి అర్థాలు ఈ పుస్తకంలో ఈయబడ్డాయి.

* * *


అజీతయే ఽ హతయే పవస్వ
స్వస్తయే సర్వతాతయే బృహతే |
తదుశాంతి విశ్వ ఇమే సఖాయ
స్తదహం వశ్మి పవమాన సోమ || (ఋ. 9-96-4)

ఓ దేవదేవా! ఓటమి గాని నాశనంగాని లేకుండా, అహంకారం పెరగకుండా స్వచ్ఛాత్ములమయ్యేలాగా మమ్మల్ని చెయ్యాలని నిన్ను మేము ప్రార్థిస్తున్నాము. మా శరీరాలను ఆత్మలనూ ఉచ్చస్థితికి గొని పొమ్మని కూడా మా ప్రార్థన. జగత్తునే కల్మషం నుండి దూరం చేసి పరిశుద్ధంగా చేయగలిగే నిర్మలాత్మకుడవు నీవు. మమ్ము శుద్ధులనుగా నొనరించు.

* * *


దృతే దృయఁహమా మిత్ర స్యమా
చక్షుషా సర్వాణి భూతాని సమీక్షంతాం|
మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని
సమీక్షే! మిత్రస్య చక్షుషా సమీక్షామహే || (యజు. 36-18)

భగవంతుడా! మాకు సమదృష్టిని ప్రసాదించు. అన్ని ప్రాణుల వైపూ ప్రేమ నిండిన కన్నులతో, కరుణ పేరుకున్న గుండెతో మేము
చూడగలుగుదుము గాక! మా పట్ల ఇతరేతర ప్రాణులన్నీ స్నేహపూరిత దృష్టులనే ప్రసరించాలి గాక! శత్రుత్వమన్నది ఏ కోశానా ఏ కోణంలోనూ మిగలకుండా పోవాలి గాక!

* * *


ఓం అపత్యే తాయవోయథా
నక్షత్రా యంత్యక్తుభిః |
సూరాయ విశ్వచక్షసే || (సామ-633)

మనస్సులోకి భగవంతు నాహ్వానించి, నిలుపుకొనగలిగినవాడే సుజనుడు. ఎలాగంటే సూర్యుడుదయించగానే నక్షత్రాలు మాయమైపోయినట్లు భగవద్భావన మన మనసులోకి ప్రవేశించగానే కామం, క్రోధం, ఆశపోతుతనం, బంధనం వంటి అంతశ్శత్రువులన్నీ పారిపోతాయి.

* * *


యః సమామ్యో ఉ వరుణో యోవ్యామ్యోఉ
యః సందేశ్యో ఉ వరుణోయో విదేశ్యః |
యో దైవో వరుణో యశ్చ మానుషః || (అ. 4-16-8)

విశ్వంలోని ప్రతి అణువూ ఆయనలోనే కలుస్తోంది. ఆయన దగ్గరే విడిపోతోంది. ఆ భగవంతుడు విదేశీయునిగానూ కనబడగలడు, మన వూరి వాడిలాగా మెలగగలడు. ఆయనలో దైవత్వం నిండుగా వుంది. మానవత్వం కూడా మనకంటె ఎక్కువే వుంది.

Preview download free pdf of this Telugu book is available at Veda Saram