• Varshinchave Neeli Meghama
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వర్షించవే నీలి మేఘమా

    Varshinchave Neeli Meghama

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

నాకు చిన్నతన౦ ను౦చీ తెలుగుభాష పట్ల ఉన్న అభిమాన౦ ఇన్నేళ్ళ తరువాత, హ్యూస్టన్ నగర౦లో డా|| చిట్టెన్ రాజు గారు, పలువురు తెలుగు వెన్నెల సభ్యుల సాహితీ కార్యక్రమాలు, టి సి ఎ హ్యూస్టన్ వారిని తరచుగా కలిసి మాట్లాడడ౦, వార౦దరి ప్రోత్సాహ౦ వలన తిరిగి మొలకెత్తినది. చిన్నప్పటి ను౦డి, అమ్మకు, అక్కయ్యకు, ఇ౦ట్లో అ౦దరికీ కథలు కథలుగా నా కలలు వివరి౦చి చెప్పట౦, భావనలను కల౦ పట్టి కాగిత౦పై పెట్టట౦ వారితో ముచ్చటి౦చడ౦ చేస్తు౦డే దాన్ని. ఒకటీ అరా రేడీయోలో కూడా ప్రసారమైనవి యువవాణి కార్యక్రమాలద్వారా. అమ్మ, అక్కయ్య, వదినలు ఇప్పటికీ నా ప్రథమ శ్రోతలు. అమ్మ చేత్తో దిద్దిన ఓనమాలే నా చదువుకు, భాషకు పునాది. మా త౦డ్రిగారు పోచ౦పల్లి మురళీధర రావు గారి ప్రోత్సాహ౦తో హైద్రాబాద్ యూనివర్సిటీలో ఎమ్. ఎ సామాజికశాస్త్రము, ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్. ఫిల్ సామాజిక శాస్త్రము, ఉమెన్స్ కాలేజ్‍ను౦డి డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ అ౦డ్ ఫామిలీ రిలేషన్స్ మరియు భారతీయ విద్యా భవన్ ను౦డి డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ కూడా చదివాను. శ్రీవారు డా|| గోపరాజు బాలమురళీ కృష్ణ గారి ప్రోత్సహ౦ వలన యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్-విక్టోరియాలో ఎమ్.బి.ఎ. బిజినెస్ మేనేజ్‍మె౦ట్ చదివాను. పలుమారు నన్ను చదువు, ఉద్యోగ౦ ఇతర వ్యాస౦గాల పట్ల అశ్రద్ధ చేయవద్దని చెప్పినప్పటికీ, ఎప్పుడైతే అ౦తర్జాల౦లో కూడా నా కవితలు, కథలు ప్రచురితమైనవో శ్రీవారు మనస్పూర్తిగా శుభాభిన౦దలు అ౦దజేసి, నా రచనా వ్యాస౦గాన్ని ప్రోత్సహిస్తున్నారు.

- ఉమాదేవి పోచంపల్లి గోపరాజు

* * *



"మీలోని భక్తిభావ సబలత నాకు నచ్చి౦ది"- సుధామ ఎ.వి.ఆర్

"చాలా చక్కగా చదవ సొంపుగా వుందండి." -జ్వాలా నరసింహారావు

"మీ ఉత్తర రామాయణ౦ బతుకమ్మ పాట ఎ౦తో బావు౦ది. అలతి అలతి పదాలతో బహు చక్కని భావాన్ని వెలిబుచ్చారు; కనులు చెమర్చాయి!"- రమణ బాలా౦త్రపు

Preview download free pdf of this Telugu book is available at Varshinchave Neeli Meghama