• Vande Valmikikokilam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వందే వాల్మీకికోకిలమ్

    Vande Valmikikokilam

    Pages: 180
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

వేదాల్లో, బృహత్కథలో, పురాణాల్లో ఎన్ని కథలు లేవు! వాటన్నిటినీ కాదని, అటు వాల్మీకి నుంచి ఇటు ఉప్పులూరి కామేశ్వరరావుగారి వరకూ అందరూ రామాయణాన్నే ఎందుకు రాశారంటే ...... రాస్తున్నారంటే దానికి జవాబు ఒక్కటే.

రామకథకి విరామం లేదు. అది వినే వారికి విసుగులేదు. చదివేవారికి కొదవలేదు.

ఎళుత్తుచియన్‌ మలయాళ రామాయణంలోనూ, తులసీదాసు హిందీ రామాయణంలోనూ, అధ్యాత్మరామాయణంలోనూ రాముడు దేవుడయితే అసలు సిసలు వాల్మీకి రామాయణంలో రాముడు మనిషి. మానవోత్తముడు.'ఆత్మానం మానుషం మన్యే' అని మానవమూర్తిగానే రాముడు మనకు దర్శనమిస్తాడు.

సుఖదుఃఖాలూ, కామక్రోధాలూ మనలాగే అనుభవిస్తూ మనవాడేననిపిస్తూ రాముడు మనకన్నా అధికుడై, ఉన్నతుడై వెలుగుదారులూ, వెన్నెలతావులూ చూపిస్తాడు.

ఈ విషయం చెప్పడానికే వాల్మీకి రాముణ్ణి దేవుణ్ణి చెయ్యలేదు. మానవుడిగానే చిత్రీకరించాడు. కాదంటే ఇది చదవండంటూ ఉప్పులూరి వారు 'వందే వాల్మీకికోకిలమ్‌' రాశారు.

ఆదికావ్యం రామాయణం మనలోని నిరాశా నిస్పృహలని ఛేదిస్తుంది. ఆశావాదాన్ని పెంపొందిస్తుంది. కష్టాలు మనిషికేనంటూ వాటిని ఎలా ఓర్చుకోవాలో చెప్తుంది. వాటినుంచి ఎలా బయటపడాలో కూడా మార్గదర్శనం చేయిస్తుంది. ఇవన్నీ మనల్ని దగ్గర కూర్చోపెట్టుకుని మనకోసం మనసారా చెప్తున్నారు ఉప్పులూరివారు. వినండి!

ఇంద్రియాల్ని జయించి రాముడు జీవితాన్ని ఏ విధంగా విజయవంతం చేసుకున్నదీ, ఇంద్రియ పరాజితుడు రావణుడు జీవితంలో ఏ విధంగా ఓడిపోయిందీ తెలుసుకోండి. చదవండి! తరించండి!

- ఎ.ఎన్‌.జగన్నాథశర్మ

Preview download free pdf of this Telugu book is available at Vande Valmikikokilam